ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాటల మాయాజాలంతో కాలం వెల్లదీస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన్నప్పటి నుండి అది చేస్తానూ ఇది చేస్తానూ అంటూ బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పటి వరకు చేసిందైతే ఏమీ లేదు. కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తాం.. నీళ్లు మనకు మనమే మళ్లించుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందాం అని చెప్పిన కేసీఆర్ అనుకున్నదానిని ఆచరణలో మాత్రం పెట్టలేకపోయారు. ఇక వాటర్ గ్రిడ్ , మిషన్ కాకతీయలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెన్టులను ప్రకటించిన తెలంగాణ సర్కార్ వాటిని నిర్వహణలో మాత్రం వెనుకబడి ఉంది. తాజాగా తెలంగాణ సర్కార్ ఊదరగొడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇళ్లలో పశువులు, మనుషులు ఒకే దగ్గర ఉంటున్నారు... అలా కాకుండా రెండు బెడ్ రూంలతో కూడిన ఇళ్లను ప్రభుత్వమే కట్టించి ఇస్తుంది అంటూ తెగ ప్రచారం చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా సిద్దం కాలేదు. కాగా రగత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లలోగా ఇందులో కూడా అవినీతి మకిలి అంటుకుంటుందో చూడాలి.
ఏడాదిన్నర కాలంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఊరడిస్తోంది. అదిగో,ఇదిగో అంటూ పేద ప్రజల్లో ఆశలు పెంచింది. మూడున్నర లక్షలతో ఇంటిని నిర్మించి ఇస్తామన్న హామీలు గాలిమాటలు అవుతున్నాయి. నిధులు, ఇండ్ల నిర్మాణాన్ని పక్కన పెడితే కనీసం మార్గదర్శకాలు కూడా సిద్ధం చేయలేని పరిస్థితి నెలకొంది. చర్చల దశలోనే మార్గదర్శకాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటి వ్యయంపై ప్రభుత్వం ఒక అంచనాకు రాలేకపోతోంది. హైదరాబాద్లో 9.50 లక్షల వ్యయం అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మూడున్నర లక్షలతో ఎలా నిర్మించాలనేదాంతో తర్జనభర్జన పడుతుతోంది. పేదింటి నిర్మాణం ఖర్చు ఎలా తగ్గించాలనే ప్రయత్నం చేస్తోంది. అంచనాల్లో వ్యత్యాసం చూపిస్తే పట్టణాలకు, గ్రామాలకు వ్యత్యాసం పెరిగే పరిస్థితి వస్తుందన్న అధికారులు చెబుతున్నారు. మూడున్నర లక్షలేమోగానీ మూడు పైసలు విడుదల కాలేదని లెక్కలు చెబుతున్నాయి. నిధులు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తింటి శోభ కనిపించడం లేదు.
పేదలకు రెండు గదులు ఇండ్ల నిర్మాణంపై ప్రభుత్వం పదే పదే చెప్తున్నా ఇప్పటి వరకూ కనీసం మార్గదర్శకాలను విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా ఈ పథకం ముందుకు సాగడం లేదు. ఇందిరమ్మ ఇళ్లలో నెలకొన్న అవినీతి, అక్రమాలపై సిఐడి చేస్తున్న దర్యాప్తు పూర్తయిన తర్వాతే రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సిఐడి విచారణ ఎప్పుడు పూర్తి అవుతుందో, దానికి కాలపరిమితి ఏమిటో ప్రభుత్వం చెప్పడంలేదు. ఇండ్ల నిర్మాణానికి సిఐడి సాకు చూపిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని లబ్దిదారులు అసంతృప్తి వ్యకం చేస్తున్నారు. 2014-15 రాష్ట్ర బడ్జెట్లో 184 కోట్లు కేటాయించింది. అయితే ఇప్పటి వరకు ఒక పైస విడుదల చేయలేదు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఇండ్ల నిర్మాణం కోసం ఉత్తర్వులు జారీ చేసి చేతులుదులుపుకుంది. అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన జీవోపై దృష్టి సారించలేదు. తెలంగాణలో 12 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటి కోసం 7,200 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయినప్పటికి నిధుల కేటాయింపులు మాత్రం శూన్యం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more