సర్కారు బడుల్లో విద్యావాలంటీచర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా 7,983 మంది విద్యావాలంటీర్లను ప్రభుత్వ పాఠశాలల్లో నియమించనున్నారు. విద్యావాలంటీర్లను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతి ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లాల వారీగా పాఠశాలల్లో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు ఎంత మంది అవసరమో ఖాళీల వివరాలను సేకరించామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు నష్టపోకుండా ఖాళీలలో విద్యావాలంటీచర్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నియమిస్తూ మార్గదర్శకాలు త్వరలో జారీ చేస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లోగా విద్యావాలంటీర్ల నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు. టీచర్ల ఖాళీలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో డిఎస్సీ ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఏడాది డిఎస్సీ ప్రకటిస్తే నియామకాల ప్రక్రియకు 5,6 నెలల సమయం పడుతుందని వివరించారు. దీనివల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులకు నష్టం కలగకుండా ఉండేందుకే విద్యావాలంటీర్లను నియమించనున్నామని తెలిపారు.
జిల్లాల వారీగా విద్యావాలంటీర్ల ఖాళీల వివరాలు..
ఆదిలాబాద్ -1244
నిజామాబాద్ -480
కరీంనగర్ -337
మెదక్ -1104
రంగారెడ్డి -1408
హైదరాబాద్ -414
మహబూబ్‌నగర్ -1646
నల్గొండ -362
వరంగల్ -314
ఖమ్మం -674
మొత్తం... -8,983
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more