Chandrababu | Arun jaitley | AP | Special status

Central finence minister arun jaitley spoke about bifercation rules only

Chandrababu, Arun jaitley, AP, Special status, Bifercation Rules, Delhi, Modi

Central finence minister Arun jaitley spoke about Bifercation rules only. AP CM Chnadrababu Naidu met PM Modi And Arun jaitley today in Delhi.

విభజన చట్టం అమలుకు సై... ప్రత్యేక హోదా గురించి నై..?

Posted: 08/25/2015 01:38 PM IST
Central finence minister arun jaitley spoke about bifercation rules only

రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రధాని మోదీతో  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సమావేశమయ్యారు. తర్వాత అరుణ్ జైట్లీతో చర్చల తర్వాత.. చంద్రబాబుతో కలిసి అరుణ్ జైట్లీ మీడియా ముందు మాట్లాడారు. సుమారు గంట పాటు ప్రధానితో చంద్రబాబు భేటీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లాంటి విస్తృతంగా చర్చలు జరిగాయన్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. ప్రత్యేక హోదాపై మరింత విస్తృతంగా చర్చించారన్నారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించిన అనంతరం విభజన హామీలను నెరవేరుస్తామని మోదీ భరోసా ఇచ్చారు. విభజన చట్టం అమలుపై త్వరలోనే రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ కు ప్రధాని ఆదేశాలు జారీచేశారు. నీతి ఆయోగ్ అధికారులు ఏపీ సర్కార్ తో ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతారని అరుణ్ జైట్లీ చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలతో పాటు పలు వివాదాలను ప్రధాని మోదీ దృష్టికి చంద్రబాబు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, పోలవరం అంశాలు కూడా ప్రధాని మోదీ బాబు సమావేశంలో చర్చకు వచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేంత వరకు ఏపీకి సాయం అందించాలని ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రధానితో భేటీ కావడానికి ముందు చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. వెంకయ్య నివాసానికి వచ్చిన రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, ప్యాకేజీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు.
ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం చర్చల్లో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా విభజన చట్టంలోని 46,90 సెక్షన్లపై చర్చిస్తున్నట్లు, రోడ్ మ్యాప్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు కొనసాగుతోందని అపుడే ఏమీ ఆగిపోలేదని ప్రధాని చెప్పినట్లు జైట్లీ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Arun jaitley  AP  Special status  Bifercation Rules  Delhi  Modi  

Other Articles