300 topless protesters | eighth annual GoTopless Day | Times Square | New York | Mayor de Blasio | bare-breasted painted ladies

Over 300 topless protesters march in manhattan

300 Topless, Toplessness, New York, topless in public, Protest, Politics, man, Manhattan Bridge, go topless day, venice, GoTopless Day at Times Square, GoTopless Day at New York,bare-breasted painted ladies, Mayor de Blasio's, GoTopless Day at Manhattan, free the nipple

Over 300 topless protesters at eighth annual GoTopless Day at Times Square in New York bashed Mayor de Blasio's effort to banish the bare-breasted painted ladies

ITEMVIDEOS: 8వ టాప్ లెస్ డే వార్షికోత్సం: అందులోనూ సమాన హక్కు కావాలట..

Posted: 08/25/2015 09:43 PM IST
Over 300 topless protesters march in manhattan

ఆకాశంలో సగం అంటూ మగవాళ్లతో అన్నింటా సమాన హక్కులు కోసం ఉద్యమిస్తున్న మహిళా లోకం మరో చిత్రమైన డిమాండ్‌తో ముందుకొచ్చింది. కేవలం షార్టులతో వీధుల్లోకి మగవారు వస్తున్నప్పుడు తాము కూడా టాప్ లెస్ గా ఎందుకు భయటకు రాకూడదని ప్రశ్నిస్తున్నా వారు గొ టాప్ లెస్ అన్న నినాదంతో. ఫ్రి ద నిప్పల్ అంటూ.. బొడ్డు పైభాగం నుంచి తల వరకు ఎలాంటి అచ్చాదన లేకుండా ఎందుకు తిరగకూడదని సవాల్ చేస్తూ కేవలం అరకోర ఆహార్యంతోనే వీధుల్లోకి వచ్చి ప్రదర్శన జరిపారు. పలు వీధులు తిరుగుతూ తమ కొత్త హక్కుల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఇందులో పిల్లల నుంచి బామ్మల వరకు పాల్గొనగా, పురుషులు కూడా వారికి మద్దతుగా నెక్కరు తప్ప ఏమీ లేకుండా వారి వెంట వీధుల్లో నడిచారు. ‘మీ స్వేచ్ఛకు మేము అడ్డు కాదు’ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు.



ఇలాంటి ప్రదర్శనలు ఒక్క అమెరికా నగరాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 60 నగరాల్లో జరిగాయి. న్యూయార్క్ సిటీలో మాత్రం మరింత ఆకర్షణగా జరిగాయి. ఎక్కడ తిరిగినా ఫర్వాలేదుగానీ ‘టైమ్ స్క్వేర్’కు మాత్రం రావద్దంటూ స్థానిక మేయర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించారు. 1992 నుంచే ‘టాప్‌లెస్’గా న్యూయార్క్ నగరంలో మహిళలు తిరిగేందుకు స్వేచ్ఛ ఉంది. అయితే ఇప్పుడు ఓ ఉద్యమంగా నిర్వహించడం మాత్రం తమకు నచ్చలేదని న్యూయార్క్ మేయర్ బిల్ దే బాసియో, పోలీసు కమిషనర్ బిల్ బ్రాటన్ వ్యాఖ్యానించారు. ఈ టాప్‌లెస్ మహిళలు  ఆఖరికి వాషింఘ్టన్ డీసీలో దేశాధ్యక్ష భవనాన్ని కూడా వదిలిపెట్టారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉన్న కారణంగా భావప్రకటనా స్వేచ్ఛ కింద మచ్చుకు లిబర్టీ విగ్రహంలా టాప్‌లెస్‌గా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు.



అంతర్జాతీయ మహిళల సమానత్వం 95వ వార్షికోత్సవాన్ని  పురస్కరించుకొని ఈ ‘టాప్‌లెస్’ నిరసనకు హాలీవుడ్ తార, మోడల్ రాచెల్ జెస్సీ పిలుపునిచ్చారు. ‘గో టాప్‌లెస్’, ‘నిపుల్ ఫ్రీ’ పేరిట ఆమె ఇచ్చిన పిలుపుకు ప్రపంచంలోని 60 నగరాల్లో మహిళలు స్పందించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. న్యూయార్క్ సిటీతోపాటు మన్‌హట్టన్, ఎడెన్‌బర్గ్ లాంటి అమెరికా నగరాల్లోనే ఎక్కువ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లతోపాటు తమకు టాప్‌లెస్ హక్కులు ఉండాలని రాచెల్ జెస్సీ డిమాండ్ చేశారు. మగవాళ్లతో పోలిస్తే తాము అన్ని రంగాల్లో అణచివేతకు గురవుతున్నామని, మొదట తాము తమ శరీర భాగాలకు స్వేచ్ఛను కలిగించాలని కోరుకుంటున్నామని, అలా చేయడం వల్ల మెదడు కూడా  స్వేచ్ఛగా ఫీలవుతుందని ఆమె అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eighth annual GoTopless Day  Times Square  free the nipple  New York  

Other Articles