Army deployed in Ahmedabad, 3 killed; Hardik Patel appeals to maintain peace

Hardik patel blows up the gujarat model

Hardik Patel, Gujara, Patel community, Other Backward Class, OBC Quota, Bharatiya Janata Party, Anandiben Patel, Curfew, patel reservation, 3 killed, gujarat violence, army, hardik protest, patel obc quota, patel community, who is hardik patel, hardik gujarat, patel protests, patidar, gujarat, reservations, ahmedabad, protests, gujarat bandh, gujarat reservations, obc

Fresh violence broke out during a day long bandh on Wednesday over the demand for OBC quota for Patels in Gujarat.

హార్ధిక్ పటేల్ అరెస్టుతో హింసాయుతంగా మారిన గుజరాత్, రంగంలోకి సైన్యం

Posted: 08/26/2015 08:03 PM IST
Hardik patel blows up the gujarat model

దేశానికే అభివృద్దిలో ఆదర్శంగా వున్న గుజరాత్.. ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ గుజరాత్లో పటేల్ వర్గం చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారింది. అహ్మదాబాద్ లోభారీ సభ జరిపిన పటేళ్లు, ఆ తర్వాత హింసకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. పటేల్ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ ను ముందు జాగ్రత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింస ఇంకా పలు ప్రాంతాల్లో రగులుతూనే వుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు ఇప్పటికీ ముగ్గురు పౌరుల ప్రాణాలు కూడా ఈ హింసాయుత ఆందోళనతో హరించుకుపోయాయి.

మెహసానాలో రాష్ట్ర హోం మంత్రి రజనీ పటేల్ ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. అహ్మదాబాద్ లో పలు చోట్ల వాహనాలు దహనం చేశారు. పరిస్థితి విషమించడంతో అహ్మదాబాద్ లోని 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. కేంద్రం హుటాహుటిన పారా మిలటరీ బలగాలను గుజరాత్ కు పంపింది. పాలన్ పూర్ పట్టణంలో బుధవారం మద్యాహ్నం ఒక వ్యక్తి హత్యకు గురికాగా, అహ్మదాబాద్ నగరంలో నిన్న రాత్రి ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు చంపేశారు. మరిన్ని ప్రాంతాలకు హింస వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అహ్మదాబాద్లోని కొన్న ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించి ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహిచనున్నట్లు తెలిసింది. వాస్తవానికి పటేళ్ల బంద్ పిలుపుతో బుధవారం గుజరాత్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. అయితే రిజర్వేషన్ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న హర్దిక్ పటేల్ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి ఆందోళన కారులు హింసాయుత కార్యక్రమాలకు దిగారు. రాత్రికిరాత్రే దాదాపు 100 బస్సులను తగలబెట్టారు. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

ఆందోళనల నేపథ్యంలో అదే రాష్ట్రానికే చెందిన ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా ఉండాలంటూ గుజరాత్ ప్రజలకు, ప్రధానంగా పటేల్ వర్గానికి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అంశం కూర్చుని మాట్లాడుకోవాల్సిందేగానీ, ఆందోళనలతో సాధ్యకాదని పేర్కొన్నారు. కాగా,  ప్రధాని సందేశం ఇచ్చిన కొద్ది గంటల్లోనే మూడో హత్య చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, గుజరాత్ లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ ప్రక్రియ అమలవుతున్నదని, రాజ్యాంగం నిర్ధేశించినదాని ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సాధ్యకాదని, పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు కల్పించేదాకా ఆందోళనలు విరమించేదిలేదని పటేళ్లు హెచ్చరిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik patel  patel reservation  3 killed  gujarat violence  army  

Other Articles