psycho | west Godavari | Psycho Halchal

Where is that injection psycho in west godavari dist

psycho, west Godavari, Psycho Halchal, ladies, Police search

Where is that Injection Psycho. In west godavari dist, a psycho targetting ladies. He injectiong some misterious in the ladies. After that injection women were seriously sick.

ఆ సైకో సూదిగాడు ఎ...క్క....డ?

Posted: 08/29/2015 11:31 AM IST
Where is that injection psycho in west godavari dist

ఏపిలో గత కొన్ని రోజులుగా అందరికి చెమటలు పట్టిస్తున్న సైకో జాడ కనిపించలేదు. ఎక్కడున్నాడో, ఎలా వస్తాడో, ఎందుకు వస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ వాడి సైకో చేష్టలకు మాత్రం ప్రజలు బలవుతున్నారు. ఆడవాళ్లను టార్గెట్ గా చేసుకొని సైకో తన సూది ప్రతాపాన్ని చూపుతున్నాడు. అసలు ఆ సూదిలో ఏముందో ఏ మందుందో ఎవరికి తెలియదు. ఆడవాళ్ల మీద తన సూదులతో దాడిచేసి గాయపర్చి ఆస్పత్రిపాల్చేస్తున్నారు. పోలీసులను ముప్పుతిప్సలు పెడుతున్న సైకో ఆచూకి పట్టుకునేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా కానీ ప్రస్తుతానికి ఎలాంటి ఫలితం లేదు. ఆ సైకో చేతికి ఇప్పటికే ఎనిమిది మంది చిక్కారు. వారిచ్చిన వివరాలతో పోలీసులు సైకో ఊహాచిత్రాన్ని విడుదల చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వారం రోజుల నుండి సంచలనం రేపుతున్న సూదిగాడు ఎంతకీ దొరకలేదు. తాజాగా ఈ ఉదయం సైకో మళ్లీ కనిపించడం అందరికి మరోసారి కలకలం కలిగిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరులో ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేసి ఉదయాన్నే వార్తల్లో నిలిచారు. టెర్రిరిస్టులున్నారన్న వార్తతో పోలీసులు ఎలాగైతే సెర్చ్ ఆపరేషన్ చేస్తారో అలా ఈ సైకో కోసం సెర్చ్ ఆపరేషన్ చేసినా కానీ పెద్దగా ఫలితం మాత్రం రాలేదు. ఊహాచిత్రాలు బయటకు విడుదల చెయ్యడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఉదయం ఆటోడ్రైవర్ మీద సైకో దాడి తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అక్కడి చుట్టుపక్కలి గ్రామాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆటోడ్రైవర్ మీద సూదితో దాడి చెయ్యడానికి ప్రయత్నించగా ఆ డ్రైవర్ తప్పించుకున్నాడు తర్వాత పోలీస్ లకు అతని గురించి సమాచారం అందించారు. మరి ఈ రోజున్నా సైకో దొరుకుతాడో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : psycho  west Godavari  Psycho Halchal  ladies  Police search  

Other Articles