సమ్మె సామాన్యులకు చుక్కలు చూపించింది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు ప్రాణసంకటంగా మారింది. పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిన పాలమూరు మహిళ పురిటినొప్పులతో బాధపడుతూ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. కార్మికుల సమ్మె కారణంగా రవాణా వ్యవస్థ స్థంభించడంతో స్వగ్రామానికి చేరుకోవడం ఆ కుటుంబానికి గగనమైంది. భార్య శవంతో, ఇద్దరు పిల్లలు, చంటిబాబుతో అతను పడ్డ అవస్థ అంతా ఇంతా కాదు. మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూర్‌కు చెందిన మహ్మద్ షఫీ పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. కూలీపనులు చేస్తూ భార్య , ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. షఫీ భార్య నిండు గర్భవతి. రోజూమాదిరే కూలీకి వెళ్లిన షఫీ ఇంటికి తిరిగొచ్చేలా పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. కాటేదాన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ అయింది. మగశిశువుకు జన్మనిచ్చి హాస్పటల్లోనే కన్నుమూసింది.
భార్య అంత్యక్రియలు చేయడం కోసం షఫీ తన పిల్లలను తీసుకుని ఉట్కూర్‌కు బయలుదేరాడు. భార్య శవంతో పాటు ముగ్గురు పిల్లలతో సహా ఈ తెల్లవారు జామున ఐదున్నరకు బస్సులో మహబూబ్‌నగర్ చేరాడు. ఐతే కార్మికుల సమ్మె కారణంగా సొంతూరుకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లే స్తోమత లేక షఫీ తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. పాలమూరు బస్టాండులో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను కలిచివేశాయి. స్పందించిన కొంతమంది ఆర్ధికసాయం అందించి ప్రైవేటు వాహనంలో షఫీని స్వగ్రామానికి పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more