China | Army | three lakhTroops

China announces cuts of three lakhtroops at military parade showing its might

China, Army, three lakhTroops, President Xi Jinping, Japan, Putin

China Announces Cuts of three lakhTroops at Military Parade Showing Its Might. President Xi Jinping of China announced on Thursday that he would reduce the country’s military personnel by 300,000, using a parade marking 70 years since the end of World War II to present the People’s Liberation Army as a force for peace and regional stability.

మూడు లక్షలు తగ్గనున్న సైనిక బలం

Posted: 09/03/2015 05:50 PM IST
China announces cuts of three lakhtroops at military parade showing its might

చైనా.. ప్రపంచంలోనే అతి ఎక్కువ సైనికుల్ని కలిగిన దేశం. ప్రపంచంలో ఎక్కడా లేనంత సైన్యం చైనా సొంతం. అమెరికా సైనిక పాటవానికి ధీటుగా తన సైన్యాన్ని కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా చైనానే. అయితే తాజాగా తమ సైనిక బలగాన్ని మూడు లక్షలు తగ్గించనున్నట్లు చైనా దేశాధ్యక్షుడు జి జింగ్ పింగ్ ప్రకటించారు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ పై చైనా పూర్తి స్థాయి విజయం 70వ వార్షికోత్సవం బీజింగ్ తియాన్మన్ స్క్వేర్ లో ఘనంగా జరిగింది. చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్ గ్రాండ్ పరేడ్ లో సైనిక వందనం స్వీకరించారు. బ్లాక్ కారులో నిలిచి ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ లక్షలాదిమంది సైనికుల వందనాన్ని తిలకించడం హైలైట్ గా నిలచింది.  ప్రపంచంలోనే అత్యధికంగా 23 లక్షలతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. ముందంజలో ఉంది. ఇంత పెద్ద సైనిక బలగాలు ఉన్న ఏకైక దేశం చైనా. జపాన్ పై చైనా ఘనవిజయం 70వ వార్షికోత్సవాల్లో పశ్చిమ దేశాల ప్రముఖ నాయకులెవరూ పాల్గొనలేదు. కానీ రష్యా ప్రెసిడెంట్ వ్లదిమీర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ తో వేదికపై నిలిచారు. జీ ఇచ్చిన విందులోనూ పుతిన్ పాల్గొన్నారు. రెండో ప్రపంచయుద్ధంలో చైనాను ఆక్రమించిన జపాన్ సైన్యాలను తరిమి కొట్టి చైనా పూర్తి విజయం సాధించడంతో .. ఇప్పుడు ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలిచింది. జపాన్ దురాక్రమణను నిర్మూలించి చైనా 5 వేల ఏళ్ల నాగరికత, శాంతి పునరుద్ధరణ జరిగిందని, అందువల్ల రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై చైనా విజయం మరీమరీ స్పెషల్ అని చైనా ప్రెసిడెంట్ జీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Army  three lakhTroops  President Xi Jinping  Japan  Putin  

Other Articles