MAA deal: Chiranjeevi share 500-cr, Nagarjuna 250 cr

Maa deal brings hundred crores to tollywood heros

chiranjeevi, nagarjuna, ram charan teja, akhil, MAA TV, Star TV, Rupert Murdoch, Morgan Stanley, STAR TV, Zee Entertainment, Dish TV, Mukesh Ambani, TV18 Broadcast, MAA TV, , Morgan Stanley values STAR TV at $11.2 billion,news, India news,Companies News

STAR India, a unit of 21st Century Fox, has acquired the entire broadcast business of MAA Tv Network Ltd for an undisclosed amount. According to sources the deal size could be about Rs 2,500 crore.

ఆ టాలీవుడ్ హీరోలకు రూ. వందల కోట్లను అందించిన ‘మా’ టీవీ

Posted: 09/05/2015 09:08 PM IST
Maa deal brings hundred crores to tollywood heros

తెలుగులో నెంబర్ వన్ ఎంటర్టెన్మెంట్ నెట్వర్క్‌గా విస్తరించిన ప్రముఖ టీవీ నెట్ వర్క్ ‘మా టీవీ' ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కోట్లాధి రూపాయలను అందిస్తుంది. ఎవరా నటులు..? ఏమా కథ అంటున్నారు. ఆరు ప్రత్యేక ఛానెళ్లతో విస్తరించిన మాటీవీ నెట్వర్క్ ను స్టార్ ఇండియా నెట్వర్క్  సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన డీల్ లో స్టార్ గ్రూప్ యాజమాన్యం మా టీవీలోని వాటాను కొనుగోలు చేసింది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ విలువ రూ. 2500 కోట్లు ఉంటుందని అంచనా. మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌కు 65 శాతం వాటా ఉండగా చిరంజీవి కుటుంబానికి 20 శాతం, అక్కినేని నాగార్జునకు 10 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి.

ఈ లెక్క ప్రకారం 20శాతం వాటా ఉన్న చిరంజీవి ఫ్యామిలీకి రూ. 500 కోట్లు, 10 శాతం వాటా ఉన్న నాగార్జునకు రూ. 250 కోట్లు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి.వారికి 125 కోట్లు చెందనున్నట్లు తెలుస్తోంది. వాటాలకు సంబంధించిన మొత్తం త్వరలోనే చిరంజీవి, నాగార్జునలకు చెందుతాయని సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దేశీయ మీడియా రంగంలో ఇది అతిపెద్ద డీల్‌గా చెప్పవచ్చు. సీరియల్‌ ఎంటర్‌ప్రీన్యూర్‌గా పేరున్న నిమ్మగడ్డ ప్రసాద్‌, బహుశ ఈ వాల్యుయేషన్‌ కారణంగానే చానెల్స్‌ విక్రయానికి సిద్ధపడి ఉంటారని అంటున్నారు. మీడియా మొగల్‌గా పేరున్న రూపర్డ్‌ మర్డోక్‌ ప్రమోట్‌ చేసిన స్టార్‌ టీవీ దేశీయ మార్కెట్‌లో దూకుడుగా విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషా చానళ్ల కొనుగోలుతో నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకుంటున్నది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  nagarjuna  ram charan teja  akhil  MAA TV  Star TV  

Other Articles