తెలుగు సినిమా వాళ్లు మనసున్న మారాజులు అని అందరికి తెలుసు. తాజాగా మహేష్ బాబు తీసిన శ్రీమంతుడు సినిమా తర్వాత ఏదైనా ఊరిని దత్తత తీసుకోవాలని మహేష్ బాబు అనుకోవడం ఆ తర్వాత ఏపిలో తన స్వంత గ్రామాన్ని, తెలంగాణలో మహబూబ్ నగర్ కు చెందిన మరోగ్రామాన్ని దత్తత తీసుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు. అయితే ఇదే బాటలో మరికొంత మంది నటులు పయనిస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తాను అనుకుంటున్నానని, తెలంగాణ పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు వివరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే కర్ణాటకలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. అదే విధంగా కొండారెడ్డిపల్లి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని తెలిపారు. కొండారెడ్డిపల్లెలో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నానని చెప్పారు. తాను నివసిస్తున్న గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి రైతులకు సాయం అందించేందుకు, గ్రామంలో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే తన సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని, అది ముగియగానే గ్రామంలో చేపట్టే పనుల వివరాలు వెల్లడిస్తానని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. గ్రామాన్ని దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్న హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more