Revanth Reddy slams telangana cm KCR

Revanth reddy slams telangana cm kcr

Revanth Reddy, KCR, Lion, Hyderabad, TRS, TDP, Cash for Vote

Revanth Reddy slams telangana cm KCR. Revanth Reddy gave one more time waning to KCR. He said he arrieved like a lion but KCR went to china with fear.

వాళ్లు పందుల్లాగా చైనా పారిపోయారు: రేవంత్ రెడ్డి

Posted: 09/09/2015 03:21 PM IST
Revanth reddy slams telangana cm kcr

రేవంత్ రెడ్డి.. తెలంగాణ తెలుగుదేశం  పార్టీ ఫైర్ బ్రాండ్, కొడంగల్ ఎమ్మెల్యే. తాజాగా ఓటుకు నోటు వ్యవహారంలో అరైస్టైన నిందితుడు. మొన్నటి దాకా కేవలం తన నియోజక వర్గానికి మాత్రమే పరిమితమైన రేవంత్ రెడ్డి తాజాగా హైకోర్ట్ ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు. కొడంగల్ నుండి ర్యాలీగా బయలుదేరిన రేవంత్ రెడ్డి హైదరబాద్ కు చేరుకున్నారు. ఎల్బీ నగర్ వద్ద రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాదరస్వాగతం పలికారు. అక్కడే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మరో సారి మాటల తూటాలు పేల్చారు. బెయిల్ మీద విడుదలైనా కానీ హైకోర్ట్ ఆదేశాలను పాటిస్తూ తన నియోజక వర్గాన్ని దాటి రాలేకపోయారు. అయితే తాజాగా హైకోర్ట్ తనకు అవకాశం కల్పించడంతో చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బిడ్డా కేసీఆర్.. సింహం సింగిల్ గా హైదరాబాద్ వస్తుంటే, పందుల్లా భయపడి.. గుంపులుగా చైనాకు వెళ్లాడు అని ఆయన అన్నారు. మొదలైంది ఆట కాదు,వేట అని రేవంత్ అన్నారు.బంగారు తెలంగాణ అవుతుందని ప్రజలు గెలిపిస్తే తాగుబోతు తెలంగాణ చేశాడని ఆయన మండిపడ్డారు.ఎల్బినగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.కెసిఆర్ నియంతృత్వం వల్ల రాష్ట్రం నాశనం అవుతోందని ఆయనద్వజమెత్తారు.హైదరాబాద్ ను అబివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీనేనని రేవంత్ అన్నారు మొత్తానికి రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ మీద మాటల వర్షం కురిపించారు. రేవంత్ పంచ్ లు వేస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు ఈలలు వేశారు. బిడ్డా తెలుగుదేశంను ఖాళీ చేస్తానంటున్నవ్ .. నీఫామ్ హౌజ్ లో బాటిల్ అనుకుంటున్నావా...? రాత్రి కూర్చుంటే పొద్దున ఐపోనింకే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  KCR  Lion  Hyderabad  TRS  TDP  Cash for Vote  

Other Articles