Cm KCR Told That He Will Build A Wonder City Like Suzhou In Telangana State | China Beautiful Cities

Cm kcr plans to make wonder city like suzhou in telangana

cm kcr, cm kcr china tour, kcr latest news, kcr updates, suzhou city, china beautiful cities, china tour, china cities, india beautiful cities

Cm KCR Plans To Make Wonder City Like Suzhou In Telangana : Cm KCR Told That He Will Build A Wonder City Like Suzhou In Telangana State.

తెలంగాణలో భూలోక స్వర్గం!

Posted: 09/12/2015 10:11 AM IST
Cm kcr plans to make wonder city like suzhou in telangana

చనిపోయిన తర్వాత ఆత్మలు నరకానికి లేదా స్వర్గానికి వెళతాయని అంటుంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం పోల్చితే.. స్వర్గం ఎంతో ప్రశాంతంగా, అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి వుంటుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇది కేవలం వినడం వరకు మాత్రమే! ఒకవేళ చూడాలంటే చనిపోవాలి. అయితే.. చనిపోవడం కూడా ఎందుకు బతికుండగానే అందరికీ స్వర్గం ఎలా వుంటుందో దాన్ని నిర్మించి చూపిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ మాటిస్తున్నారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఫుల్ బిజీగా వున్న ఈయన.. అక్కడ జరిగిన ఓ సదస్సు సందర్భంగా తాను తెలంగాణ రాష్ట్రంలో భూలోక స్వర్గంలాంటి అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానని పేర్కొన్నారు.

చైనా పర్యటనలో భాగంగా షాంఘై నుంచి బీజింగ్ కు బయలుదేరు ముందు కేసీఆర్ బృందం.. ప్రపంచంలోనే భూలోక స్వర్గాలుగా పేరుగాంచిన అతికొన్ని నగరాల్లో ఒకటైన ‘సుజు’ పారిశ్రామిక నగరాన్ని సందర్శించింది. అనంతరం ‘చైనా-సింగపూర్ సుజు ఇండస్ట్రియల్ సిటీ’ కమిటీ సభ్యులైన యూకే జైన్ తో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో భాగంగా.. ఆ (సుజు) నగరాన్ని ఎలా నిర్మించారు? ఏ విధమైన అభివృద్ధి పనులను చేపట్టారు? అన్న విషయాలను జైన్ తెలంగాణ టీమ్ కు వివరించారు. ఇక ఆ నగరంలో సుమారు 7 లక్షలమందికి పైగా పనిచేస్తున్నారని తెలుసుకున్న కేసీఆర్ ఆశ్చర్యపోయారు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆ నగరం గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలోనూ అదే తరహాలో నగరాన్ని నిర్మిస్తామని, దానికి సహకరించాలని కోరారు.

ఇదిలావుండగా.. మొత్తం 288 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి వున్న సుజు నగరంలో వందలాది కంపెనీలున్నాయి. ఆ కంపెనీలపై లక్షలమంది ఉద్యోగులు ఆధారపడి వున్నారు. ఇంకా ఈ నగరం అభివృద్ధి చెందుతూనే వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  suzhou city  kcr china tour  

Other Articles