Bertie the fastest tortoise

Bertie the fastest tortoise

Bertie, the fastest tortoise, Guinness World Records

Bertie the fastest tortoise They may not usually be known for being fast movers, but Bertie is the tortoise equivalent to Usain Bolt.At his home in Adventure Valley, a family adventure park in Brasside, Durham, UK, Bertie sprinted over a 5.48 m course set at a gradient of 1:12 in a speedy 19.59 seconds, consequently winning his title as the Fastest tortoise in the world.

ITEMVIDEOS: తాబేలు పరుగు... రికార్డ్ బ్రేక్

Posted: 09/12/2015 11:42 AM IST
Bertie the fastest tortoise

తాబేలు అంటేనే నిదానం అని అందరికి తెలుసు. ఒక్క కుందేలు, తాబేలు కథలో తప్ప ఎన్నడూ తాబేలు స్పీడ్ గా పరిగెత్తిన సందర్భం లేదు. అయితే నిదానానికి పెట్టింది పేరుగా ఉండే తాబేలు ఒకవేళ స్పీడ్ గా పరిగెడితే.. స్పీడ్ గా పరుగెత్తి ఏకంగా వరల్డ్ రికార్డును సృష్టిస్తే ఎలా ఉంటుంది..? వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉన్నా కానీ ఇది నిజం.. ఇదే జరిగింది. అంతకు ముందున్న గిన్నిస్ రికార్డులను బద్దలుకొడుతూ తాజాగా ఓ తాబేలు తన పరుగుతో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. లండన్ కు చెందిన ఈ తాబేలు తాజాగా రికార్డ్ మీద మీరూ ఓ లుక్కేయండి.

లండన్ లోని డర్హమ్ ప్రాంతంలో జనెస్ కాల్జిన్ అనే మహిళ ఓ తాబేలుకు యజమాని. ఆ తాబేలు పేరు బెర్జీ. వయస్సు పదేళ్లు. ఇది కేవలం స్ట్రాబెర్రిలను మాత్రమే తీసుకుంటుంది. గతేడాది 19.59 సెకన్లలోనే 18 ఫీట్లు పరుగెత్తి రికార్డ్ సృష్టించింది. 1977వ సంవత్సరంలో 43.7 సెకన్లలో ఉన్న రికార్డును బెర్జీ బద్దలుకొట్టింది. అంతేకాకుండా 100 మీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లోనే చేరుకుంది. ఈ రికార్డులను నెలకొల్పిన ఆ తాబేలును తాజాగా గిన్నిస్ బుక్ లోకి ఆమోదించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bertie  the fastest tortoise  Guinness World Records  

Other Articles