In a first, two Indian institutes make it to world's top 200

Two indian institutes make a breakthrough in world s top 200

Massachusetts Institute of Technology (MIT), Harvard university, University of Cambridge, Stanford University in third place, London top four universities, world’s best universities, MIT, Indian institutes, Indian Institute of Science, IIT-Delhi, Indian Institute of Science, Bengaluru

Two Indian institutes have made a breakthrough for the first time in history to make it into the top 200 lists of world's best universities.

ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మన యూనివర్సిటీలకు స్థానం

Posted: 09/15/2015 08:29 PM IST
Two indian institutes make a breakthrough in world s top 200

భారత్‌కు చెందిన రెండు విశ్వవిద్యాలయాలు అరుదైన ఘనత సాధించాయి. ప్రపంచంలోని రెండు వందల అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో తొలిసారిగా మన విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టాప్-200 యూనివర్సిటీల లిస్టులో చేరాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఈ జాబితాలో 147వ ర్యాంకు దక్కించుకోగా, ఐఐటీ ఢిల్లీ 179వ స్థానం సొంతం చేసుకుంది. కాగా ఐఐటీ బొంబాయి కొద్దిలో తన స్థానాన్ని కోల్పోయింది. ఐఐటీ బొంబాయికి 202 ర్యాంకింగ్ తో సరిపెట్టుకుంది.
 
ది మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ) అగ్రస్థానం కైవసం చేసుకుంది. దీని తర్వాతి స్థానంలో హార్వార్డ్ యూనివర్సిటీ నిలిచింది. కాగా, మూడో స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా కొనసాగుతున్నాయి. ఇక, ప్రపంచంలోని టాప్-50 అత్యుత్తమ యూనివర్సిటీల్లో నాలుగు లండన్ నగరంలోనే ఉండడం గమనార్హం. ఆ జాబితాలో బోస్టన్ (3), న్యూయార్క్ (3) తర్వాతి స్థానంలో ఉన్నాయి. పారిస్, సిడ్నీ, హాంకాంగ్, బీజింగ్ నగరాల్లో రెండేసి ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలున్నాయి.

ఇక టాప్ 200 యూనివర్సిటీలలో యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన 30 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో స్థానం దక్కించుకోవాగా, నెదర్ లాండ్స్ 12 విశ్వవిద్యాలయాలతో, జెర్మనీ 11, కెనడా, అస్ట్రేలియా, జపాన్ చెరో 8 మూనివర్సిటీలతో నిలువగా, చైనాకు చెందిన 7, ఫ్రాన్స్, స్వీడెన్, హాంగ్ కాంగ్ లకు చెందిన ఐదేసి విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో స్తానం దక్కించుకున్నాయి. కాగా, ఈ జాబితాను క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సంస్థ ప్రకటించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles