AP Govt decided to supply two five star fans to people

Ap govt decided to supply two five star fans to people

AP, Fans, five stars, Power, ERC, Power saving in Ap

AP Govt decided to supply two five star fans to people. Chandrababu Naidu consontrated on power saving in the state of ap.

ఏపిలో ఫ్యాన్ల పంపిణి.. ఎందుకంటే

Posted: 09/17/2015 01:23 PM IST
Ap govt decided to supply two five star fans to people

ఏపిలో విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా కొత్త ఫ్యాన్ల పంపిణికి ప్రభుత్వం రంగం శ్రీకారం చుట్టింది. 5 స్టార్ నాణ్యత ప్రమాణాలు కలిగిన ఈ ఫ్యాన్లతో 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని.. ప్రభుత్వమంటోంది. ఈ ఫ్యాన్లకు అయ్యే ఖర్చును నెలసరి బిల్లుల్లో వాయిదా పద్దతుల్లో చేర్చుతామన్న డిస్కంల నిర్ణయంపై.. వచ్చే నెల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఈఆర్ సి సిద్ధమవుతోంది. ఏపి లో విద్యుత్ వాడకంలో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.. ప్రభుత్వం. విద్యుత్ ఆదా చేసే 5-స్టార్ రేటెడ్ గృహోపకరణాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రతి ఇంటికి రెండేసి ఫ్యాన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. 1700 విలువ చేసే ఒక్కోఫ్యాన్ విద్యుత్ వినియోగం, సాధారణ ఫ్యాన్ ఉపయోగించుకునే విద్యుత్ లో 80 శాతాన్నే ఉపయోగించుకుంటుంది. దీని ద్వారా కేవలం ఫ్యాన్ల వాడకం వల్లే 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని.. అధికార్లు అంటున్నారు.

దేశంలో తొలిసారిగా అమలు చేయనున్న ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని, నర్సపురంలో అమలు చేయాలని అధికార్లు నిర్ణయించారు. దీనికి సంబంధించి నిర్వహించిన సర్వేలో 50 వేల గృహాల్లో లక్ష ఫ్యాన్లు అవసరం అవుతాయని తేల్చారు. ఇంట్లో ఉన్న పాత ఫ్యాన్ కు వంద రూ. విలువను జోడించనున్నారు.. అధికార్లు. మిగిలిన మొత్తాన్ని ఏడాదికి 10 శాతం వడ్డీతో వాయిదా పద్దతిలో నెలసరిగా వచ్చే కరెంట్ బిల్లుల్లోనే వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ తతంగం పై నిర్వహించిన ప్రాజెక్టు సమగ్ర సర్వే ఫలితాలు, ప్రభుత్వ చర్యలును వివరిస్తూ..డిస్కాం అధికార్లు, విద్యుత్ నియంత్రణ కమిషన్ కు నివేదిక సమర్పించారు. దీంతో ఈ పథకంపై  ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వచ్చే నెల 9 న కోర్టు సమావేశాన్ని నిర్వహించనుంది ఈఆర్సి. ఫ్యాన్ల పంపిణీ పథకం ఫలితాలు, ప్రభుత్వ ఆలోచనలకు దగ్గరగా ఉంటే...త్వరలో ఫ్రిజ్, ఇరన్ బాక్స్, వాషింగ్ మిషిన్.. తదితర విద్యుత్ పరికరాలను అందించేందుకు అధికార్లు సిద్దమవుతున్నారు. మరోవైపు ప్రజా స్పందన సానుకూలంగా ఉంటే, ఏపి లో విద్యుత్ వినియోగం భవిష్యత్ లో భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Fans  five stars  Power  ERC  Power saving in Ap  

Other Articles