Teen Delhi Footballers Turned Into Heroes

Teen footballers became heroes

delhi, Teen players, Football, Foreign lady, Delhi Footballers, Thief

They were just your average neighbourhood boys, just kicking a ball around in a park. Then they became much more. When the teens in a south Delhi neighbourhood heard cries for help, they sprang into action.It was late at night in August when the shouts rang out. The boys raced out of the park and saw a man attacking a foreigner.

ITEMVIDEOS: వాడితో ఫుట్ బాల్ ఆడుకున్నారు.. హీరోలయ్యారు

Posted: 09/18/2015 04:11 PM IST
Teen footballers became heroes

వాళ్లు మామూలు ఫుట్ బాల్ ఆడుకునే పిల్లలు. అలాగని నేషనల్, ఇంటర్నేషన్ మ్యాచ్ లు ఆడినే మేటి ఆటగాళ్లు కూడా కాదు.. కానీ వాళ్లు ఒకడితో ఫుట బాల్ ఆడిన తీరు వాళ్లను హీరోలను చేసేసింది. తాజాగా విడుదలైన  సిసిటివి వీడియో పుటేజ్ వారిని హీరోలను చేసింది. ఫఅసలే ఫుట్ బాల్ ఆడుకునే ఆటగాళ్లు.. కసి తీరా ఎవరినైనా కొట్టాలనుకుంటే ఎలా కొడతారు చెప్పండి.. ఉతికి ఆరేస్తారు కదా. అదే పని వాళ్లు చేశారు. న్యుఢిల్లీలో చోటుచేసుకున్న ఓ ఘటన రోడ్డు పక్కన టైంపాస్ కోసం ఫుట్ బాల్ ఆడుకునే వాళ్లను హీరోలను చేసింది. టైం అంటే ఇదేనేమో మరి నిన్నటి దాకా మామూలు వ్యక్తులుగా ఉన్న వాళ్లు సోషల్ మీడియా పుణ్యమా అని హీరోలుగా మారారు.

న్యుఢిల్లీలో గత నెలలో చోటుచేసుకున్న ఘటనకు సంబందించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్ టూర్ కు వచ్చిన ఓ ఫారెనర్ ను ఓ దొంగ వెంబడించి.. ఎవరూ లేరని ఆమె మీద దాడికి పాల్పడ్డాడు.. ఆమె వద్ద నుండి ఫోన్ లాక్కున్నాడు. అయితే అదే టైంలో అక్కడికి కొంత మంది ఫుట బాల్ ఆడుకునే పిల్లలు రావడంతో ఆమె అరిచింది. దాన్ని గమనించిన ఆ ఆటగాళ్లు అతడిని వెంబడించారు. కారు వెనుక దాగున్న అతన్ని పట్టుకొని నాలుగు ఉతికి.. పోలీసులకు అప్పగించారు. ఇదంతా అక్కడున్న సిసిటివి కెమెరాల్లో రికార్డై ఉంది. తాజాగా ఆ వీడియో పుటేజిలు వెలుగులోకి రావడంతో ఆ ఆటగాళ్లు హీరోలుగా మారారు. విదేశీ వనితకు రక్షణగా నిలిచిన ఆ ఢిల్లీ కుర్రాళ్లకు హాట్సాఫ్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  Teen players  Football  Foreign lady  Delhi Footballers  Thief  

Other Articles