ఢిల్లీలో మరో నిర్భయ ఘటన జరిగింది. ఉబర్ క్యాబ్ ఘటన తరువాత అదే తరహాలో కొబ్బరి బోండా కోసం వెళ్లిన వివాహితను అపహరించిన క్యాబ్ డ్రైవర్, అతని మిత్రులు అమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని పీరాఘార్హి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ ప్రాంత సాగర్ పూర్ ప్రాంతంలోని పశ్చిమ్ విహార్ ఏరియాలో నివసించే ఓ 37 ఏళ్ల మహిళ.. కోబ్బరి బొండాల కోసం రోడ్డు దాటుతున్న క్రమంలో వెనక నుంచి వచ్చి క్యాబ్ తన పక్కన అగింది. అందులోని వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హుటాహుటిన దిగి తనను బలవంతంగా కారోలో ఎక్కించారు. అరిస్తే చంపేస్తామంటూ అమెను మారాణాయుధాలతో బెదిరించారు.
అమెను కారు ఎక్కించుకున్న తరువాత సుమారు రెండు గంటల పాటు పలు ప్రాంతాలలో తిప్పారు. ఆనంతరం మరో ఇద్దరు వచ్చి కారును ఎక్కగానే పీరాగర్హి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి అమెను బలవంతంగా తీసుకెళ్లి అమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. పలుమార్లు మార్చమార్చి వారు బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు పిర్యాదులో పేర్కోందని పోలీసులు తెలిపారు. బాధితురాలి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులందరినీ తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి ముందు మహిళను కిడ్నాప్ చేసేందుకు వినియోగించిన క్యాబ్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కిడ్నాప్ సహా నిర్భయ చట్టం కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more