తమిళనాడులో రేకెత్తిన ఓ వివాదం నేపథ్యంలో అక్కడ దీక్ష చేపట్టేందుకు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు. తమిళతంబీలు తమ మాతృభాషను ఎంతగా గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే వారు నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని ప్రవేశ పెట్టారు. ఈ చట్టంతో తమిళనాడు రాష్ట్రంలో వున్న ఇతర మైనార్టీ భాషలైన తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం విద్యాభ్యాసానికి విద్యార్థులు దూరమవుతున్నారని ఆయా భాషావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్ సంస్థలు హైదరాబాద్ లో ధర్నా నిర్వహించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెలాఖరున ఆయన దీక్ష చేపట్టనున్నారని ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు, తెలుగు భాషాభిమానులు ఆయన దీక్ష కోసం సన్నాహాలు చేస్తున్నారు. అటు వైకాపాధినేత జగన్ కూడా ఈ సమస్య తీవ్రతపై స్పందించారు. తెలుగుభాషా పరిరక్షణకు ముఖ్యమంత్రి జయలలితతో తాను సంప్రదిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లుగా ఆందోళనలో పాల్గొన్న తెలుగువారు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more