Girls Turns Into Boys After 12 Years Because Of Rare Genetic Disorder | Astonishing Village | Strange Things

Girls turns into boys after 12 years rare genetic disorder astonishing village

girls turn into boys, strange things in the world, world strange things, genetic disorders, boy turns into girls, gender chage, Dominican Republic, growing penis at 12, guevedoce boys

Girls Turns Into Boys After 12 Years Rare Genetic Disorder Astonishing Village : In a remote village in the Dominican Republic girls become boys at puberty because of a rare genetic disorder.

బాబోయ్.. అమ్మాయిలు మగపిల్లలైపోతున్నారు!

Posted: 09/21/2015 03:19 PM IST
Girls turns into boys after 12 years rare genetic disorder astonishing village

అవును.. టైటిల్ చదవడానికి ఆశ్చర్యకరంగా వున్నా నమ్మక తప్పదు. ఆ ప్రదేశంలో ఆడపిల్ల వున్నట్లుండి మగపిల్లగా మారిపోతోంది. ఇలా ఇప్పటికే చాలామంది అమ్మాయిలు మగపిల్లలాగా మారిపోయింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఈ చమత్కారం ఎలా సాధ్యమని కొందరు నిపుణులు పరిశీలించగా.. కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పుట్టే బిడ్డల్లో జన్యలోపం కారణంగా సహజసిద్ధంగానే జెండర్ మారిపోతోంది. ఈ కారణంగా పుట్టిన ఆడపిల్లలకు 12 సంవత్సరాలు రాగానే మగపిల్లలుగా మారిపోతారు. ఈ వింత కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్ లో చోటు చేసుకుంటోంది.

పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. బిడ్డ తల్లిగర్భంలో వున్నప్పుడు ఎంజైమ్ లోపం కారణంగా మగబిడ్డగా పుట్టాల్సింది ఆడశిశువుగా పుడుతుంది. ఆడపిల్లగా పుట్టిన వారిలో డీ హైడ్రో టెస్టోస్టిరాన్ హర్మోన్ కారణంగా వారికి 12 సంవత్సరాల వయస్సు రాగానే మగపిల్లలైపోతారు. ఆడపిల్లలు మగపిల్లలుగా మారడాన్ని శాస్త్ర పరిభాషలో ‘గెవెడాసెస్’ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇక డొమెనిక్ రిపబ్లిక్ లో ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలుగా మారుతున్నారనే విషయాని కొస్తే.. ప్రతి 90 మందిలో ఒకరు ఇలా మారిపోతున్నారు. సాలినాస్ పట్టణంలో అయితే ప్రతి 90 మందిలో ఇద్దరు ఆడ శిశువులుగా పుట్టి.. 12 సంవత్సరాల తర్వాత మగబిడ్డలుగా మారిపోతున్నారు. ఇటువంటి సంఘటన మొట్టమొదటిసారి 1970లో వెలుగుచూసిందని డాక్టర్ మైఖేల్ మోస్లే తెలిపారు. ఇప్పటికీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైద్యులు కనుగొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girls turn into boys  genetic disorders  

Other Articles