Talasani told the future of a congress leader

Talasani told the future of a congress leader

Talasani, UttamKumar, Indiramma, Houses, Telangana, Congress, jail

Talasani Srinivas told the future of a congress leader. He said that Uttam Kumar will go to jail for his role in Indiramma houses.

అతడు జైలుకెళ్లడం ఖాయం: తలసాని

Posted: 09/22/2015 08:26 AM IST
Talasani told the future of a congress leader

మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమలో ఉన్న లోపలి వ్యక్తిని బయటకు తీస్తుంటారు. పొన్నాల లక్ష్మయ్యలాగా అప్పుడప్పుడు స్టెప్పులేస్తూ.. వి హన్మంత రావులాగా దురువుకు మైకం వచ్చిన్నట్లు ఊగిసోవడం చేస్తుంటారు. అయితే చాలా మంది మాత్రం చేసే ఓ పని ఉంది. అదే భవిష్యవాణి చెప్పడం.. పలానా నాయకులు అలా అవుతారు.. పలానా పార్టీ పరిస్థితి అది అంటూ ముందు ఏం జరిగుతుందో ఊహించి చెబుతుంటారు. తాజాగా అదే కోవలోకి ఓ తెలంగాణ మంత్రి కూడా చేరారు. ఓ మంత్రిగారు మరో పార్టీకి చెందిన నాయకుడికి ఖచ్చితంగా జైలు జీవితం తప్పదని వెల్లడిస్తున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలుసా..? తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్. ఆయన ఎవరి గురించి అలా అన్నారు..? ఎందుకు అన్నారు..? లాంటి విషయాలు తెలియాలంటే మొత్తం స్టోరీ చదవండి.

ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో అప్పటి గృహనిర్మాణ శాఖ మంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగిన హౌసింగ్‌ స్కామ్‌లో చాలా మంది నాయకులకు సంబంధముందని చెప్పారు. వారందరినీ అరెస్టు చేస్తే జైళ్లు కూడా సరిపోవన్నారు. హౌసింగ్‌ అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జాప్యానికి కాంగ్రెసే కారణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఫోబియానే టీడీపీకి పట్టుకుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talasani  UttamKumar  Indiramma  Houses  Telangana  Congress  jail  

Other Articles