Balakrishna isa real leader

Balakrishna playing his political leader role perfectly

Balakrishna, Hindupuram, TDP, Hindupauram MLA, Chandrababu Naidu, NBK, Nandamuri Balakrishna, Balakrishna news, Balakrishna Latest News, Balayya

Balakrishna playing his political leader role perfectly. Nandamuri Balakrishna as a MLA, doing his duty with full dedication.

ITEMVIDEOS: నందమూరి బాలకృష్ణ.. ఓ మంచి ఎమ్మెల్యే

Posted: 09/24/2015 09:27 AM IST
Balakrishna playing his political leader role perfectly

నందమూరి బాలకృష్ణ అంటేనే సినిమా హీరోగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తన తండ్రి నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న  బాలకృష్ణ నటనలో తన తండ్రికి తగ్గ తనయుడు అని అందరి చేత అనిపించుకున్నాడు. ఒక్క నటనలోనే కాదు ఎన్టీఆర్ లాగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందుపురం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి పూర్తి మెజారీటీతో గెలిచారు. అయితే తన రక్తంలో ఉన్న నటన, రాజకీయాలను బాలకృష్ణ కూడా బాగా ఒంటపట్టించుకున్నారు. అందుకే ఓ వైపు హీరోగా సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే.. రాజకీయాల్లో తన పాత్రను పోషిస్తున్నారు. ఓ నటుడిగా సినిమా బాగా రావడానికి ఎంత కష్టపడతారో.. తన నియోజక వర్గంలోని ప్రజల బాగోగులను కూడా బాలకృష్ణ బాగా పట్టించుకుంటున్నారు.

హిందుపురంలో ఉంటున్న ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తు.. వారికి మరింత చేరువవుతున్నారు. కలెక్టరేట్ లో నిర్వహించే ఫిర్యాదుల దినోత్సవాన్ని కూడా బాలకృష్ణ ఎంతో నిబద్దతో నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చెయ్యడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వెంటనే సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాజకీయాలు అంటే కేవలం స్పీచ్ లు ఇవ్వడమే అనే భావనను తీసి.. సేవ చేస్తూ అసలు రాజకీయ నాయకుడిగా మారుతున్నారు. లీడర్ అంటూ ప్రజలకు దూరంగా ఏసీల్లో ఉండటం కాదు.. ప్రజల్లో ఒకడిగా, వారికి సమస్యలు వస్తే వారికి అండగా నిలిచే వాడే. బాలకృష్ణ హిందుపురంలో నిర్వహిస్తున్న సమీక్షలు, మీటింగ్ లు అక్కడి వారికి ఎంతో మేలు చేస్తున్నాయి. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పనుల మీద బాలకృష్ణ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అందుకే నడిపించే నాయుకుడు మా బాలయ్య అంటున్నారు హిందుపురం వాసులు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles