the Real battle between all parties in Hyderabad

The real battle between all parties in hyderabad

Vote Bank, Hyderabad, GHMC, Elections, TRS, TDP, Congress, Election commission, GHMC Elections

the Real battle between all parties in Hyderabad. The election commission delete some major votes in the GHMC. The parties fighting to save their own vote bank.

ఆ లిస్ట్ కోసం అన్ని పార్టీలు తహతహ

Posted: 09/24/2015 04:26 PM IST
The real battle between all parties in hyderabad

హైదరాబాద్ రాజకీయం ఓటర్ల లిస్టు చుట్టూ తిరుగుతోంది. ఓటర్ల తొలగింపు వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య నిప్పు రాజేస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ అక్రమంగా ఓటర్లను తొలగిస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంటే అసలు ఒక్కరి ఓటునూ తొలగించలేదంటోంది అధికారపక్షం. గ్రేటర్ ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో మొదలైన ఈ ఓటర్ల జాబితా యుద్ధం ఎటు తిరుగుతుందన్నది ఆసక్తికి రేకెత్తిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన చేసింది. జంటనగరాల పరిధిలో ఒకే ఓటర్ పేరు నాలుగైదు చోట్ల నమోదైన సంఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని, ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి. డూప్లికేషన్ లేకుండా అన్నివిధాలా నిర్ధారించుకొని, ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నవారి పేర్లను ప్రకటించింది.

అయితే, ఎన్నికల సంఘం ప్రకటించినట్లుగా తొలగించిన జాబితాలో అనూహ్యంగా 6 లక్షల 30 వేల ఓట్లు తేలడం విశేషం. అది కూడా ఈ డూప్లికేషన్ అన్ని ప్రాంతాల్లో ఉంటే ఎవరికీ అనుమానం వచ్చేది కాదు, ఆందోళన వ్యక్తమయ్యేదీ కాదు. కానీ, జంటనగరాల్లోని మొత్తం 18 డివిజన్లలో కొన్ని సెలెక్టివ్ పాకెట్స్-లోనే తొలగిస్తున్న ఓట్లు అధికంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతుతన్నాయి. ఓటర్ల లిస్టు నుంచి తొలగిస్తున్న ఓటర్ల జాబితా విషయానికి వస్తే కూకట్-పల్లి డివిజన్-లో లక్షా 21 వేల ఓట్లు గల్లంతవుతున్నాయి. ఖైరతాబాద్ సర్కిల్-లో 50,112 మంది ఓటర్లను, కుత్బుల్లాపూర్ డివిజన్-లో 43,140 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అర్హులు కానివారు, అందుబాటులో లేని ఓటర్లు, తాళాలు వేసి ఉన్న ఇళ్లు, మరో ప్రాంతానికి మారిపోయిన ఓటర్లు ఇలా అనేక కారణాలతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 6 లక్షల 30 వేల 652 ఓటర్లను తొలగించేందుకు రంగం సిద్ధమైపోయింది. అభ్యంతరాలుంటే వాటిని పరిశీలించి, అర్హులైతే జాబితాలో చేర్చుతామంటోంది ఎలక్షన్ కమిషన్. అయితే అది అంత ఈజీ కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.

ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ఖండించారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. గ్రేటర్ పరిధిలో ఒక్క ఓటునూ తొలగించడం లేదన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్-లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఓటర్ల జాబితా కోసం సాగుతున్న కసరత్తుపైనే విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చేలోగా లిస్టులో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం దక్కుతుంది. పార్టీల జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఓటర్ల తొలగింపు ఉండడంతో ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది కాంగ్రెస్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Vote Bank  Hyderabad  GHMC  Elections  TRS  TDP  Congress  Election commission  GHMC Elections  

Other Articles