పవిత్ర హజ్ యాత్ర ఎంతో ఫుణ్యమని, హాజ్ ను సందర్శించిన తరువాత మరణమే వచ్చినా.. తాము ఆహ్వానిస్తామని భావించడంతో పాటు విశ్వసిస్తారు మహ్మదీయ సోదరులు. అంతటి పవిత్ర స్థలంలో మాత్రం నిత్యం విషాదాలు చోటుచేసు కుంటున్నాయి. అయితే ఏడాదికేడాది అక్కడి పరిస్థితులను మార్చి.. యాత్రికులను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. విషాద ఘటనలు మాత్రం జరుగుతూనే వున్నాయి. యాత్రికుల కుటుంబాలను అనాధలుగా మార్చేస్తున్నాయి. యాత్రికుల నిర్వహణ ఏ యేడాదికాడేడాది అధికారులకు ఓ ఛాలెంజ్‌గా పరిణమిస్తుంటుంది. గత పాతికేళ్లలో మక్కాలో జరిగిన విషాద సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి.
* 11 సెప్టెంబర్, 2015న క్రేన్ పడిపోయిన ఘటనలో 107 మంది చనిపోయారు.
* 2006లో మక్కా సమీపంలోని మీనా ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 360 మంది యాత్రికులు చనిపోయారు.
* 2006లో హజ్ యాత్ర ప్రారంభ ముందు రోజు ఎనిమిది అంతస్థుల భవనం కూలి 73 మంది చనిపోయారు.
* 2004లో హజ్ వేడుక ముగింపు చివరిరోజు జరిగిన ప్రమాదంలో 244 మంది యాత్రికులు చనిపోయారు.
* 2001లో హజ్ వేడుక చివరిరోజు జరిగిన తొక్కిసలాటలో 35 మంది మృతిచెందారు.
* 1998లో సైతాన్ పై రాళ్లు విసిరే క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 180 మంది చనిపోయారు.
* 1997లో జరిగిన గుడారాల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 340 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు.
* 1994లో మీనా వద్ద రాళ్లు విసిరే ఘటనలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 270 మంది చనిపోయారు.
* 1990లో పాదయాత్ర ద్వారా మక్కాకు చేరుకునే ఓ సొరంగ మార్గంలో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది చనిపోయారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more