Prince of Kolkata becomes king of Bengal

Ganguly to take charge of cab

cab president, sourav ganguly, cab president post, mamata banerjee sourav ganguly, sourav ganguly meets mamata banerjee, cricket association of bengal, bengal cricket, cricket news, bengal cricket news, cricket news india, sports news, sports news

Former India captain Sourav Ganguly on Thursday was unanimously chosen as the president of Cricket Association of Bengal (CAB).

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ

Posted: 09/24/2015 08:25 PM IST
Ganguly to take charge of cab

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గంగూలీ నియమకాన్నిపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఖరారు చేశారు. అంతకుముందు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మృతితో ఆ స్థానం ఖాళీ అయ్యింది. అయితే చాలా మంది సౌరవ్ గంగూలీ పేరును సూచించారు. అంతకుముందు ‘క్యాబ్’ సంయుక్త కార్యదర్శి హోదాలో సౌరవ్ ఉన్నా.. అతనికి అనుభవం తక్కువ అనే అభిప్రాయం వినిపించింది.  

వీటన్నింటికీ తెరదించుతూ సీఏబీ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మమత ప్రకటించారు. భారత జట్టుకు కెప్టెన్ గా సేవలందించిన గంగూలీ. ఇప్పుడు క్యాబ్ అధ్యక్షుడిగా అభివృద్ధికి బాటలు వేస్తాడని మమతా బెనర్జీ అశాభావం వ్యక్తం చేశారు. మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న గంగూలీ.. అదే తరహాలో బెంగాల్ క్రికెట్ ను కూడా ముందుకు తీసుకువెళతారని మమత అకాంక్షించారు. దీంతో పాటు దాల్మియా కుమారుడు అభిషేక్ కు 'క్యాబ్'లో జాయింట్ సెక్రటరీ పదవి దక్కేంది.

ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. 'దీదీకి దన్యవాదాలు. క్యాబ్ అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషిచేస్తాను. క్యాబ్, బీసీసీఐ మాజీ చీఫ్ జగ్మోహన్ దాల్మియా లోటును పూడ్చటం చాలా కష్టం. దాల్మియా కూమారుడు కూడా క్యాబ్ లో సభ్యుడు అయినుందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్యాబ్ అధికారులతో పనిచేసిన అనుభవం నాకుంది' అని క్యాబ్ అధ్యక్షుడిగా నియామకం అనంతరం వ్యాఖ్యానించాడు. మూడు రోజుల కిందట క్యాబ్ చీఫ్గా ఉన్న జగ్మోహన్ దాల్మియా తీవ్ర అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles