సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ముఖ్యంగా యువతీ యువకులపై వుంటుందని వాస్తవం. ఈ ప్రభావంతోనే అనేక మంది తమ ఇళ్లను వదిలి గతంలో మద్రాసు మెయిల్ ఎక్కేసి.. సినిమాలలో రాణించి తమ ప్రతిభను చాలుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల ప్రభావం యువతపై అధికంగా లేదనే చెప్పవచ్చు. వారు చేయాల్సిందంతా షార్ట్ ఫిల్మ్ లలో చేసేసి యూట్యూబ్, సామాజిక మాధ్యమాలలో పెట్టేసి హిట్లు కోట్టేసి అప్పుడు తన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అవకాశం వచ్చే వరకు తమ ప్రతిభను షార్ట్ ఫిల్మ్ లలో కనబరుస్తూనే వున్నారు. అయితే వీరికి బిన్నంగా, గతకాలం హీరోల మాదిరింగా అలోచించిన యువతి హీరోయిన్ కావాలనే మోజుతో పూరి జగన్నాథ్ ఇంటి ముందు తచ్చాడుటం.. చివరకు పోలీసు ఠాణాకు వెళ్లడం.. అమె తల్లిదండ్రులు రావడం అన్ని చకచకా జరిగిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి(19) నర్సంపేటలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుంది. వెండితెర మీద వెలిగిపోవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉన్న ఆమెకు.. దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే అభిమానం. ఆయన సినిమాలతోనే హీరోయిన్ అవ్వాలని భావించి.. బుధవారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా వరంగల్ నుంచి నేరుగా ఫిలింసిటీకి వచ్చింది. అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న యువతిని అటు వైపు నుంచి వస్తున్న ఆనంద్ అనే ట్యాక్సీ డ్రైవర్ చూసి వివరాలు అడిగాడు.
తాను పూరి జగన్నాథ్ నివాసానికి వెళ్లాలని చెప్పడంతో అదే రాత్రి 1 గంట ప్రాంతంలో ట్యాక్సీలో ఆమెను జూబ్లీహిల్స్ రోడ్ నెం.31లోని పూరి ఇంటి వద్ద దిగబెట్టాడు. తెల్లవారే వరకు నిద్రాహారాలు మాని పూరీ కోసం వేచి చూసిన ఆమెకు 10 గంటల వరకు కూడా ఆయన కనిపించలేదు. అయితే రాత్రి నుంచి అనుమానాస్పదంగా యువతి అక్కడ తచ్చట్లాడుతుండటం గమనించిన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని తండ్రి హనుమాన్‌సింగ్‌కు ఫోన్ చేసి రప్పించారు. అర్ధరాత్రి యువతి ఒంటరిగా నేషనల్ హైవేపై నిల్చోవడమే కాకుండా అదే రాత్రి జూబ్లీహిల్స్‌లోని దర్శకుడి నివాసానికి రావడం పోలీసులను కంగారు పెట్టించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more