PM Narendra Modi Latest Speech in UN Meeting | narendra modi updates

Pm narendra modi highlight speech in un meeting

narendra modi, un meeting, narendra modi speech, narendra modi updates, narendra modi controversy, un meeting, narendra modi in un meeting, modi speech

PM Narendra Modi Highlight speech in UN meeting : PM Narendra Modi Gave Excellent Speech In UN Meeting

ఐక్యరాజ్య సమితిలో మోదీ అదరగొట్టారు

Posted: 09/26/2015 10:10 AM IST
Pm narendra modi highlight speech in un meeting

‘ఐక్యరాజ్య సమితిని శక్తివంతం చేయాలి. ఐరాసలో తప్పనిసరిగా సంస్కరణలు చేపట్టాలి. నేటి ప్రపంచ వ్యవహారాల్లో ఇది అత్యవసరం. పేద దేశాలకు సంపన్న దేశాలు బాసటగా నిలవాలి. టెక్నాలజీని సంపన్న దేశాలలు ఇతరులకు పంచాలి. పేదరిక నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇద్దాం. ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది పేదలున్నారు. పేదరికం నుంచి ప్రపంచం విముక్తి పొందాలి. వ్యక్తిగత స్థాయిలో అభివృద్ధికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్య, నైపుణ్యాభివృద్ధి మా ప్రాధాన్యాలు. అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి’ ఇలా సాగిపోయింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సర్వ ప్రతినిధి సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.

‘ఈ రోజు మనం ఒక కొత్త దిశా నిర్దేశాన్ని నిర్ణయించేందుకు ఇక్కడ సమావేశం అయ్యాం. ప్రస్తుతం ప్రపంచంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థ అయిన ఐరాస శక్తివంతం కావలసిన ఆవశ్యకత ఉంది. ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించడానికి సమర్థమైన వ్యవస్థగా ఐరాస పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశమూ ఎలాంటి ముప్పునూ ఎదుర్కోవడానికి వీల్లేదన్నారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలు ఒక్కటిగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది దారిద్ర్యరేఖకు దిగువన పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వారందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకు వచ్చేందుకు సుస్థిరమైన అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను మోదీ స్పష్టంగా వ్యక్తం చేశారు.

పర్యావరణం, దాని ప్రాధాన్యతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ప్రపంచ స్థాయిలో విద్యా కార్యక్రమాలు రూపొందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను కలిసికట్టుగా ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కట్టుబడి ఉంటాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పర్యావరణానికి అనుకూలమైన, పునర్వినియోగ ఇంధనాలపై మనం దృష్టి సారించాలని, ఈ మేరకు మన జీవన విధానంలోనూ మార్పులకు సిద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. మన తర్వాతి తరాలను ప్రకృతి ప్రేమికులుగా తీర్చిదిద్దుదామంటూ ఐరాస సభ్య దేశాలకు ఆయన సూచించారు.

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆమోదించిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు- 2030’లో భారత అభివృద్ధి ఎజెండా ప్రతిబింబిస్తోందని మోదీ అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా చేస్తున్న కృషిలో భాగంగా వ్యక్తిగత రంగానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘ఆర్థిక సమ్మిళితంపై మేం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాం’ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తుందని, భూమిని తల్లిగా గౌరవిస్తుందని అలాంటి సంస్కృతికి నిలయమైన దేశం నుంచి తాను వచ్చానని మోదీ చెప్పారు. ప్రతి చిన్న చిన్న ద్వీప దేశాలతో కూడా అభివృద్ధిలో తాము భాగస్వాములవుతున్నామని, ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామన్నారు. అందుకే తాను ‘నీలి విప్లవాన్ని’ సమర్థిస్తున్నానని చెప్పారు. ‘నీరు కలుషితం కావద్దు. ద్వీప దేశాల రక్షణ, అభివృద్ధి జరగాలి. ఆకాశం నీలంగా స్వచ్ఛంగా ఉండాలి- ఇదే నీలి విప్లవం’ అని ఐరాస సర్వ ప్రతినిధుల సభను ఉద్దేశించి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  UN Meeting  BJP Party  

Other Articles