Chandrababu Naidu Says Some Interesting Comments About Him and Andhra Pradesh Development Schemes | Capital City Amaravathi

Chandrababu naidu interesting comments andhra pradesh development capital city amaravathi

chandrababu naidu, ap capital city amaravathi, amaravathi master plans, chandrababu latest press meet, andhra pradesh state, ap state issues, ap special status, sand mafia controversy, red sandal mafia cases, chandrababu interesting stories

Chandrababu Naidu Interesting Comments Andhra Pradesh Development Capital City Amaravathi : In The Latest Press Meet Chandrababu Naidu Says Some Interesting Comments About Him and Andhra Pradesh Development Schemes.

పాపం.. చంద్రబాబుకు ఎంత కష్టమొచ్చిందో?

Posted: 09/26/2015 11:48 AM IST
Chandrababu naidu interesting comments andhra pradesh development capital city amaravathi

ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజధాని నిర్మాణం, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం, ప్రజల సంక్షేమాలకు సరికొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ప్రాజెక్టులపై సమీక్షలు.. ఇంకా బోలెడన్ని పనులతో ఆయన సతమతమవుతున్నారు. ఆయన ఎంతగా శ్రమిస్తున్నాడంటే.. ఒక్కోసారి స్నానం చేయడానికి కూడా తనకు సమయం లేదట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెబుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను అహర్నిశలూ శ్రమిస్తున్నానని, కొన్ని సందర్భాల్లో స్నానం కూడా చేయకుండానే హడావిడిగా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన పరిస్థితులు వుంటున్నాయని బాబు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం పదహారు నెలల చిన్న బిడ్డ అని పేర్కొన్నారు. ఆర్థికపరంగా వెనుకబడ్డ ఈ రాష్ట్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అన్నివిధాల పాటుపడుతున్నానని చెప్పారు. ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, రౌడీయిజం వంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని... వాటిని అరికట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని అన్నారు. ‘నిరసనలు, ఉద్యమాల పేరుతో ఎవరైనా ఆందోళనలు చేస్తామంటే, ఆత్మహత్యలు చేసుకుంటామంటే.. అనుమతి ఇస్తామా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజనతో దెబ్బతిన్న రాష్ట్రం కోలుకోవడానికి మరో మూడు, నాలుగు నెలలు పడుతుందని ఆయన అన్నారు. విశ్వవ్యాప్తంగా గర్వించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు మరోమారు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Ap Capital City Amaravathi  

Other Articles