జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను పెంచుతున్నారన్ని వచ్చిన ఊహాగానాలకు ఇక చెక్ పడినట్లే. ఎందుకంటే జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యలను యధతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే డివిజన్లలో ఓటర్ల సంఖ్య సమాన నిష్పత్తిలో వుండేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ సహాచరులతో జరిపిన సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. 150 డివిజన్లనే కొనసాగించినా.. జనాభా మాత్రం సమాన నిష్పత్తిలో ఉండేలా డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 67,31,790 జనాభా ఉంది.
ఇందుకు అనుగుణంగా 150 డివిజన్లలో ఒక్కోదానికి 44,879 మందిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇలా కుదరని పక్షంలో 10 శాతం అటూఇటుగా సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం కాన్షీబజారు డివిజన్లో అత్యల్పంగా 17,601 జనాభా ఉండగా, శేరిలింగంపల్లిలో గరిష్టంగా 93,141 జనాభా ఉంది. ఇలాంటి ఈ వ్యత్యాసానికి తావు లేకుండా డివిజన్ల జనాభాలో సమాన నిష్పత్తి ఉండేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం 150 డివిజన్లలో కోర్ సిటీలో 100, శివారులో 50 డివిజన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ తర్వాత కోర్ సిటీలో 67, శివారులో 83 డివిజన్లు ఉండనున్నట్లు సమాచారం. డివిజన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన జీవో మరో రెండ్రోజుల్లో వెలువడనుంది.
వారం, పది రోజుల్లో ముసాయిదా ప్రతిని ప్రజల ముందుంచి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. తొలుత 200 డివిజన్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే జీహెచ్ఎంసీ కమిషన ర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 150 డివిజన్లనే ఖరారు చేయాలని నిర్ణయించింది. కార్పోరేటర్లు ఎక్కువగా ఉన్నట్లయితే కౌన్సిల్ నిర్వహణలో ఏర్పడనున్న ఇబ్బందులను కూడా కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కమిషనర్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డివిజన్ల ఖరారుకు మార్గం సుగమమైనట్లు చర్చసాగుతుంది. ఇప్పటికే డీలిమిటేషన్‌కు సంబందించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more