A Teenage Girl Suffered With Hepatitis By Drinking Green Tea Regularly For Three Months | Green Tea Effects

Girl turns yellow develops hepatitis from drinking green tea regularly

green tea effects girl, green tea caused hepatitis, green tea benefits, green tea effects, hepatitis symptoms, hepatitis causes, health problems, green tea health problems

Girl turns yellow develops hepatitis from drinking green tea regularly : Doctors identified green tea as the “causative agent” of the girl’s hepatitis, and ordered her to stop drinking it immediately.

గ్రీన్ టీ.. ఓ బాలిక కొంప కొల్లేరు చేసేసింది!

Posted: 09/28/2015 05:59 PM IST
Girl turns yellow develops hepatitis from drinking green tea regularly

అవును.. మీరు చదువుతోంది నిజమే! ఎన్నో పోషకాలతో నిండిన గ్రీన్ టీని మోతాదుకు మంచి తాగితే అనారోగ్యబారిన పడక తప్పదని ఓ బాలిక ఉదంతం నిరూపించింది. అప్పటిదాకా ఆనందంగా వున్న ఆమెను ఆ టీ రాత్రింబవళ్లు నిద్ర లేకుండా చేసింది. ఆ బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎంతలా దెబ్బ తీసిందంటే.. ఏకంగా అత్యంత హానికరమైన రోగాల్లో ఒకటిగా పరిగణించే పచ్చకామెర్ల బారిన పడేలా చేసింది. ఆ దెబ్బతో కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. చివరికి ఆ బాలిక ఆరోగ్యంగా బయటపడింది. ఇంతకీ ఆ టీకి, బాలికకు సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుత ఆధునిక యుగంలో ‘జీరో సైజ్’ ట్రెండ్ జోరుగా సాగుతోంది. అందుకే.. లావుగా వున్న వాళ్లు సన్నబడేందుకు నానారకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామాలు చేయడంతోపాటు రకరకాల ఎలక్ట్రానిక్ ప్రోడక్టులను వాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వ్యక్తుల బలహీనతను పసిగట్టిన కొన్ని ప్రోడక్టులు.. ప్రేక్షకుల్ని తమవైపు ఆకర్షించుకునేందుకు టీవీల్లో బీభత్సంగా యాడ్స్ ఇచ్చేస్తున్నారు. టీవీ పెట్టామంటే చాలు.. ‘మీరు సన్నబడాలనుకుంటున్నారా? అయితే మా ప్రోడక్ట్ వాడండి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గించుకోండి.. పైగా మార్కెట్ లో కంటే తక్కువ ధరకే అమ్ముతాం’ అంటూ స్పీకర్ బాక్సులు బద్దలయ్యేలా, చెవులు చిల్లులుపడేలా యాడ్స్ ప్రసారమవుతూనే వుంటాయి. ఇక ఈమధ్య కాలంలో ‘గ్రీన్ టీ’ యాడ్ కూడా ఈ తరహాలోనే ప్రసారమవుతోంది. ‘గ్రీన్ టీ తాగండి.. సన్నబడండి’ అంటూ యాడ్ విస్తృతంగా వస్తూనే వుంది.

అలాంటి యాడ్ కి ఆకర్షీతులైన ఓ బాలిక.. బరువు తగ్గాలని భావించి, చైనాకు చెందిన గ్రీన్ టీకి ఆర్డరిచ్చి తెప్పించుకుంది. ఆ యాడ్ లో చెప్పినట్లుగానే ఆ బాలిక కూడా రోజుకు మూడు కప్పులు చొప్పున మూడు నెలలు తాగింది. అంతే! ఒళ్లు తగ్గడం విషయం అటుంచితే.. ఆ బాలిక తీవ్ర అస్వస్థకు గురైంది. కడుపు, కండరాల నొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు పచ్చకామెర్లు సోకాయని తేల్చారు. రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడం వల్లే పచ్చకామెర్లు వచ్చాయని వారు స్పష్టం చేశారు. ఇది.. అసలు సంగతి! చివరికి ఆ బాలిక గ్రీన్ టీ తాగడం ఆపేయగానే బాలిక కోలుకుందని వైద్యులు తెలిపారు. ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని బ్రిటిష్ జర్నల్ కథనం ప్రచురించింది. అటువంటి యాడ్స్ తో జాగ్రత్తగా వుండాలని సూచిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : green tea effects girl  hepatitis symptoms  health problems  

Other Articles