rishiteswari case court sanctioned conditioned bail to three accused

Rishiteswari accused got conditional bail after 77 days

Rishiteshwari death case, Rishiteshwari suicide case, three accused in Rishiteshwari death case, ragging, harassment, rishiteswari accused got conditional bail after 77 days. ANU Engineering Student Rishiteshwari,

In latest update in Rishiteshwari death case, the three accused of ragging and harassment receive conditional bail after 77 days.

ITEMVIDEOS: రిషితేశ్వరి కేసు నిందితులకు కండిషనల్ బెయిల్

Posted: 10/01/2015 07:14 PM IST
Rishiteswari accused got conditional bail after 77 days

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొదటి సంవత్సరం ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా వున్న ముగ్గురు నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ర్యాగింగ్ పేరుతో అమెకు నరకయాతన చూపారని.. వాటిని భరించలేక చివరకు బాధితురాలు అసువులు బాసిందన్న అభియోగాలతో అరెస్టు అయిన ముగ్గురు నిందితులు.. తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది.


గుంటూరు జిల్లా 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే.  A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్గా ఉన్నారు. గతంలో వీరి బెయిల్ పిటిషన్ను కోర్టు పలుమార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరి రిమాండ్ ఖైదీలుగా శిక్షను అనుభవిస్తూన్న 77 రోజుల తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishiteswari suicide case  nagarjuna university  accused got bail  

Other Articles