Rahul gandhi got free salary

Rahul gandhi got free salary

Rahul Ganhi, AICC, Congress, parliament, sessions, Parliament sessions, MP, Mps salary

RSS mouthpiece Organiser has alleged that Congress vice-president Rahul Gandhi claimed his salary and availed benefits during his 56-day leave of absence in February-March. The report “Expose: Rahul gets pay without work” was published in the latest edition of Organiser.

రాహుల్ గాంధీకి ఫ్రీ.. ఫ్రీ. ఫ్రీ జీతం

Posted: 10/06/2015 12:48 PM IST
Rahul gandhi got free salary

ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ గురించి దేశం మొత్తం తెలుసు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఆశాకిరణంగా రాహుల్ గాంధీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఎన్నికలు వస్తే అసలు ఎవరు ఏం చేస్తున్నారో విపక్ష నేతలు వెల్లడిస్తారు. తాజాగా బీహార్ ఎన్నికల హడావిడి సాగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ మీద ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు రాహుల్ గాంధీ ఫ్రీగా జీతం తీసుకుంటున్నారని మండిపడుతోంది. అవును రాహుల్ గాంధీ ఫ్రీగా అంటే అసలు పని చెయ్యకుండానే జీతం తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రజాధనాన్ని రాహుల్ ఫ్రీగా అప్పనంగా ఆరగించేస్తున్నారని తెగ బాధపడిపోతోంది. కానీ వారు చెప్పిన దాంట్లో నిజాలున్నాయి. నిజంగానే రాహుల్ గాంధీ ఫ్రీగా జీతం తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీకి ఫ్రీగా జీతం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

రాహుల్ గాంధీ. ఏఐసిసి వైస్ ప్రెసిడెంటే కాదు ఓ ఎంపీ కూడా. ప్రతి ఎంపీకి పార్లమెంట్ తరఫున జీత భత్యాలు అందుతాయి. వారి నెల వారి ఖర్చుల కింద ఎంతో కొంత జీతం రూపంలో అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాహుల్ గాంధీ కూడా ఎంపీ కాబట్టి ఆయనకు కూడా అందరిలాగా జీతం ఇస్తుంది. అయితే జీతం అంటూ మామూలుగా అనుకఃకుంటున్నారేమో... నెలకు యాభై వేల రూపాయలు. నెలకు యాభై వేల రూపాయలతో పాటుగా పార్లమెంట్ సమావేశాలు ఉన్నన్ని రోజులు రోజుకు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే తాజాగా రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా.. ఎవరికి కనిపించకుండా దేశం వదిలి ఎక్కడో మారుమూల... కనిపించని ప్రదేశంలో దాదాపు రెండు నెలలు ఉన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల సమయంలోనే రాహుల్ ఆకస్మిక పర్యటన వేసుకున్నారు. అయితే దీని మీదే ఇప్పుడు దుమారం రేగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎంపీలకు ఇచ్చే రెండు వేల భత్యం, నెలకు అందుకునే యాభై వేల రూపాయలు నిజానికి ఫ్రీగా తీసుకున్నారు అంటోంది. ఎందుకంటే పార్లమెంట్ కు రాకుండా సెలవు మీద ఎక్కడికో వెళ్లిపోవడం.. మళ్లీ పని చెయ్యని దానికి జీతం తీసుకోవడం ఏంటని ప్రశ్న. మరి నిజమే రాహుల్ గాంధీ ఎంత పాపులర్ అయినా ఇలా ఫ్రీగా ప్రజా ధనాన్ని తీసుకోవడం ఏ మాత్రం సబబు కాదుగా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Ganhi  AICC  Congress  parliament  sessions  Parliament sessions  MP  Mps salary  

Other Articles