A doctor attempt to rape a patient

Doctor attempt to rape

Doctor, Secundrabad, Tirumalagiri, Rape, Harrasment, Hyderabad, Doctor tried to Rape

In Secundrabad, Tirumalagiri a Doctor tried to rape patient in his clinic. Police filed a FIR on that doctor and took him custody.

డాక్టర్ కామం.. కేరాఫ్ తిరుమలగిరి

Posted: 10/06/2015 03:52 PM IST
Doctor attempt to rape

ఆడవాళ్ల మీద అత్యాచారాలు  అంతకంతకు పెరుగుతున్నాయి. ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామంతో కళ్లు బైర్లు గమ్మి పశువులా ప్రవర్తించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మాత్రం డాక్టర్లను కూడా అవహేళన చేస్తోంది. వైద్యో నారాయణో హరిః అని అంటారు. అంటే వైద్యం చేసే వైద్యుడు దేవుడితో సమానం అని కానీ కొంత మాత్రం అందుకు మినహాయింపు కోరుతారు. కామంతో తమ వద్దకు వచ్చిన ఓ రోగిని చరిచేందుకు ప్రయత్నించిన ఘటన వైద్య వృత్తికి కలంకం తీసుకువస్తోంది. చివరకు పోలీసులచేత కటకటాల వెనక్కి పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన తాజా ఘటన అందరికి ఆశ్చర్యాన్ని ఓ రకంగా సిగ్గు పుట్టుస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి కూడా అమ్మాయిలు అయితే ఆలోచించేలా చేస్తోంది.

హైదరాబాద్ మహా నగరం.. ఎంతో మందికి జీవన ఉపాధి కల్పిస్తున్న నగరాల్లో ఇది ఒకటి. రాజకీయ నాటకాలకు, పాత కాలంలో రాజకుటుంబాలకు నెలవు. అయితే హైదరాబాద్ లో గత కొంత కాలంగా అకృత్యాలు కూడా పెరుగుతున్నాయి. అంతకంతకు క్రైమ్ రేట్ కూడా పెరుగుతోంది. తాజాగా జరిగిన ఒక ఘటన అందరికి విస్మయం కలిగిస్తోంది. తాజాగా సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన ఓ క్లినిక్ లో దారుణం చోటుచేసుకుంది. వైద్యం కోసం వెళ్లిని ఓ యువతికి డాక్టర్ మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. అనంతరం ఆ యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. మత్తు నుంచి తేరుకున్న యువతి ప్రతిఘటించింది. డాక్టర్‌పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వాళ్లను నిజంగా సమాజం నుండి వెలివెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doctor  Secundrabad  Tirumalagiri  Rape  Harrasment  Hyderabad  Doctor tried to Rape  

Other Articles