Hollywood Crazy Actress Angelina Jolie Childhood Home Hits Market For 2 Million Dollars | Hollywood Updates | Angelina Jolie House

Angelina jolie childhood home hits market 2 million dollars hollywood updates

Angelina Jolie house, Angelina Jolie childhood house, Angelina Jolie pitts, Angelina Jolie hot photo shoot, Angelina Jolie updates, hollywood news, Angelina Jolie hot gossips, Angelina Jolie house for sale

Angelina Jolie Childhood Home Hits Market 2 Million Dollars Hollywood Updates : Angelina Jolie Pitt's childhood home is officially up for grabs.The four-bedroom midcentury modern located in Rockland County, New York is listed for $2.049 million.

ఏంజెలీనా జోలిది 2 మిలియన్ డాలర్లట!

Posted: 10/07/2015 10:54 AM IST
Angelina jolie childhood home hits market 2 million dollars hollywood updates

ప్రముఖ హాలీవుడ్ తార ఏంజెలీనా జోలికి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు! నిజానికి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అంతకుముందు అంతగా ప్రాధాన్యత వుండేది కాదు కానీ.. ఈమె ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ తరహా చిత్రాలు సంతరించుకున్నాయి. ఐదుపదుల వయస్సు దాటినా ఇప్పటికీ తన చెదరని అందంతో కుర్రకారులను ఊర్రూతలూగిస్తున్న ఈ అమ్మడి క్రేజ్ మార్కెట్ లో ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. కేవలం ఆమెకే కాదు.. ఆమెకు సంబంధించిన వస్తువులకు సైతం అంతే గుర్తింపు వుంటుందని తాజాగా జరిగిన ఘటనే నిదర్శనంగా నిలిచిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

ఏంజెలీనా జోలికి సంబంధించిన చిన్ననాటి నివాసాన్ని అమ్మకానికి పెట్టగా.. అది ఇప్పుడు మార్కెట్లో అత్యధిక రేటు పలికి వార్తల్లోకెక్కింది. న్యూయార్క్ దగ్గరలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రాక్ ల్యాండ్ కౌంటీ హౌస్.. సుమారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించింది. ఏంజెలీనాకు పెరిగిన క్రేజ్ లాగే ఆ నిర్మాణానికీ ఇటీవల భారీ క్రేజ్ పెరిగిపోయింది. గతేడాది అమ్మకానికి పెట్టిన కౌంటీ హౌస్ అప్పట్లో ఒక మిలియన్ డాలర్లు అంటే దాదాపు ముఫ్పై కోట్ల రూపాయలు పలుకగా... కేవలం ఒక్క ఏడాదిలోనే రెట్టింపై ఇప్పుడు రెండు మిలియన్ల డాలర్లకు పైగా అంటే దాదాపు అరవైకోట్ల రూపాయల పై చిలుకు రేటుతో అమ్ముడు పోయింది. 1950లో నిర్మించిన కౌంటీ హౌస్ ను కండక్టర్ యూజీన్ కోన్ తన స్వంతం చేసుకున్నారు. 1980 సంవత్సరం వరకూ కౌంటీ హౌస్ ఏంజెలినా తల్లి మార్చెలిన్ బెట్రాన్డ్ యాజమాన్యంలో ఉండేది. మార్చెలిన్ ఆమె భర్త వాయ్ గెట్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఏంజెలీనా తోపాటు ఆమె సోదరుడు జేమ్స్ ను తీసుకొని బెట్రాన్డ్ లాస్ ఏంజెల్స్ కు మకాం మార్చేసింది.

అప్పట్లో ఏంజెలీనా  స్నెడెన్స్ ల్యాండింగ్ లోని ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుండేది. నాలుగు బెడ్ రూమ్స్ ఉన్న కౌంటీ హౌస్ ను నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1950వ దశకంలో నిర్మించారు. ఏంజెలీనా ఇల్లు ఒక్క ఏడాదిలోనే రెట్టింపు రేటు పెరిగిపోయిందంటే ఆమెకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇదే విషయమై హాలీవుడ్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Angelina Jolie house  Hollywood Updates  

Other Articles