Revanth Reddy warning to TRS leaders

Revanth reddy warning to trs

KCR, Revanth Reddy, TDP, farmers, Telangana, Suicides

Revanth reddy warned TRS leaders for their leder KCR and his govt. Revanth Reddy also gave warning to KCR for not alloting new loans for farmers

ITEMVIDEOS: టిఆర్ఎస్ వాళ్లను వేప చెట్లకు కట్టిండి

Posted: 10/07/2015 01:25 PM IST
Revanth reddy warning to trs

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ రైతుల బాగోగులను పట్టించుకోవడం లేదు. దాంతో ఎంతో మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యల మీద తెలంగాణ సర్కార్ స్పందించడం లేదు. రైతుల రుణమాఫీల మీద ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఏకంగా అసెంబ్లీ సమావేశాల నుండే ప్రతిపక్షాలను సస్పెన్షన్ వేటు వెయ్యడం దారుణం. అయితే అధికారపక్షానికి చెందిన నాయకులు ఇలా ప్రతిపక్షాలు లేకుండా ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం వైఖరిని నిరసిస్తు ప్రతిపక్షనాయకలు నిర్వహించిన రైతుల ఓదార్పు యాత్రలో అన్ని పక్షాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అయితే అందరి కన్నా రేవంత్ రెడ్డి మాటలు కేసీఆర్ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుతెప్పించేలా ఉన్నాయి. ఒక్క కేసీఆర్ నే కాదు.. టిఆర్ఎస్ నాయకులను కూడా రేవంత్ రెడ్డి ఏకిపారేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని లక్షకోట్ల బడ్జెట్ తో కేసీఆర్ చేతిలో పెడితే.. కనీసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టి రైతులకు రుణమాఫీ చెయ్యడానికి డబ్బులు లేవని అనడం సిగ్గుమాలిన చర్య అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫార్మ్ హౌజ పాలన నడుస్తోందని అన్నారు. ప్రజల డబ్బులతో కోట్లు ఖర్చు చేసి చైనా వెల్లి.. అక్కడ మందు విందులతో మజా చేశారని అన్నారు. గ్రామంలోకి వచ్చే టిఆర్ఎస్ కార్యకర్తలను పట్టుకొని వేప చెట్టుకు కట్టివెయ్యాలని రేవంత్ అన్నారు. అలా వేప చెట్టుకు కట్టేసిన టిఆర్ఎస్ కార్యకర్తల లాగుల్లో తొండలు వదలాలని రేవంత్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Revanth Reddy  TDP  farmers  Telangana  Suicides  

Other Articles