Crops Destroyed for Rahul Gandhi

Crops destroyed for rahul gandhi

Rahul Gandhi, Karnataka, farmer, Rally, Rahul gandhi rally, Ramchandra guha

For Rahul Gandhi's rally in Karnataka on Saturday, crops have been cleared before harvest from an area the size of roughly three football fields. A stage is being put up in farm lands near a village in Ranibennur in central Karnataka. Maize grown on four acres of land reportedly belonging to one farmer has been destroyed. Among the voices of criticism is that of noted historian Ramchandra Guha, who tweeted today: "A poor farmer in Karnataka loses valuable cropland to a stage built for Rahul Gandhi to come and go."

రాహుల్ గాంధీ వల్ల 4 ఎకరాలు నాశనం

Posted: 10/07/2015 04:03 PM IST
Crops destroyed for rahul gandhi

అవును.. కాంగ్రెస్ పార్టీ యువరాజు, ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సభ అంటే మామూలుగా ఉంటుంది. హంగు హార్భాటాలు, జనం, హోరెత్తించే మైక్ సెట్లు, భారీ హోర్డింగ్ లు అంతా హడావిడే. అయితే ప్రతి మంచి వెనుక ఓ చెడు ఖచ్చితంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ సభ పుణ్యమా అంటూ ఓ రైతు కుటుంబ బాధపడింది. అవును రైతు కుటుంబం ఎంతో బాధపడింది ఎందకంటే రాహుల్ పర్యటన వల్ల ఆ రైతు కటుంబానికి నష్టం వచ్చింది కాబట్టి. అయితే కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రసంగం కోసం అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అతి వల్ల రైతు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. చేతికందిన కూడు నోటికందకుండా పోయినట్లు రాహుల్ మీద అంతా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...

కర్ణాటకలోని రాణిబెన్నూరులో రాహుల్ గాంధీ మీటింగ్ కోసమని ఓ వేదికను ఎంచుకున్నారు. దాన్ని చదును చేసి జనాలు అక్కడికి వచ్చేటట్లు చేశారు. అయితే రాహుల్ గాంధీ అక్కడికి వచ్చాడు.. సభ ముగిసింది.. అంతా సజావుగా జరిగింది. అయితే సభ జరిగిన ప్రదేశం మీద ప్రస్తుతం దుమారం రేగుతోంది. ఎందుకంటే ఆ స్థలం ఓ రైతు పొలంలొనిది కాబట్టి. అది కూడా రైతు గోధుమ పంటను వేయగా మరో 15 రోజుల్లో పంట కోతకు కూడా వచ్చింది. కానీ అంతలోనే హుటాహుటినా రాహుల్ గాంధీ కోసం అంటూ అక్కడ పొలాన్ని తొలగించి. సభ వేదికను ఏర్పాటు చేశారు. దీని మీద సామాజిక కార్యకర్త రామచంద్రగుహ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. రాహుల్ సభ కోసం ఓ బక్క రైతు బలి  దాంతో ప్రస్తుతం రాహుల్ సభ ఏర్పాటు మీద విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Karnataka  farmer  Rally  Rahul gandhi rally  Ramchandra guha  

Other Articles