పశ్చిమ బెంగాల్ లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అది విచిత్రమా, లేక విధి వైపరిత్యామా లేక సృష్టికే అర్థంకాని శేష ప్రశ్నగా మిగిలింది. రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల బాలుడి గర్భం దాల్చాడు. అతడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు బాలుడి కడుపులోంచి కాళ్లు, చేతులు, గోళ్లు, పూర్తిగా రూపుదిద్దుకోని తల భాగంతో ఉన్న మృత పిండాన్ని వైద్యులు వెలికి తీశారు. నాలుగేళ్ల చిన్నారి బాలికలే గర్భం దాల్చడం విచిత్రంగా పరిగణించే సమయంలో నాలుగేళ్ల బాలుడు కడుపులో ఇలా.. మృత పిండాన్ని తొలగించడం.. విధి వైపరిత్యకం కాక మరేంటారు.
వివరాల్లోకి వెళితే బిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్కిబంద్ గ్రామంలో నివసించే నాలుగేళ్ల బాలుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడటంతో అతని తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అయితే ప్రాథమికంగా ఆ బాలుడిని పరిశీలించిన వైద్యులు అతడి కడుపులో ఏదో ట్యూమర్ ఉండొచ్చని అనుమానించారు. నిర్ధారణ కోసం స్కాన్, సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆ బాలుడి పొట్టలో మృతపిండం ఉన్నట్టుగా నిర్ధారణ అయిందని డా. శ్రీషేందు గిని తెలిపారు.
దీంతో అతడికి శస్త్రచికిత్స చేసి కాళ్లు, చేతులు గోళ్లు, పాక్షికంగా రూపుదిద్దుకున్న తల భాగాలతో కూడిన మృత పిండాన్ని తొలగించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. వైద్యశాస్త్రం పరిభాషలో దీన్ని పిండంలో పిండం అని పిలుస్తామని డా. గిని తెలిపారు. సుమారు అయిదు నుండి ఆరు లక్షల మందిలో ఇలాంటి అరుదైన సంఘటన జరుగుతుందని పేర్కొన్నారు. గర్భంతో ఉన్నపుడు పిండదశలో జరిగే కొన్ని అవాంఛనీయ మార్పుల వల్ల ఇలా జరుగుతుందన్నారు. ముఖ్యంగా గర్భంలో కవల పిండాలు రూపుదిద్దుకునే క్రమంలో ఒక పిండంలోకి మరో పిండం చొరబడటం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more