నల్గొండ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఉన్న సీఎంకు విషయం తెలియగానే వెంటనే స్పందించారు. తక్షణం ఘటనా స్థలికి వెళ్లాలని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డిని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు శాసనసభ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను తగిన విధంగా ఆదుకుంటామని కేసీఆర్ సభాముఖంగా ప్రకటించారు.
సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ చనిపోయినవారిలో చాలా మంది ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణీకులు ఉన్నారని, వారికి ఆర్టీసీ తరఫున రూ. లక్ష పరిహారం ఇస్తుందని, ప్రభత్వ తరఫునుంచి కూడా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, వాళ్ల స్థితిగతులను చూసి.. ఆ కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సభ తరఫున కేసీఆర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా అతి వేగంతో వచ్చిన లారీ.. అర్టీసీ ప్రయాణికుల పాలిట మృత్యు శకటంలా మారింది. వేగంగా దూసుకువచ్చిన లారీ బస్సును ఢీకొనడంతో పదిహేను మంది ప్రాణాలను కబళించింది. అనేక మందిని క్షతగాత్రులను చేసింది. ఒక మలుపు వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ వైపు కూర్చున్న వాళ్లంతా మరణించారు. దాదాపు వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. నల్లగొండ జిల్లాల్లో మలుపుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 25 మంది ప్రయాణికులతో వెళుతున్న AP29 Z 2270 నెంబర్ బస్సు నల్లగొండ నుంచి భువనగిరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more