వివాహిత మహిళపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు.. ఆమెను ఎలాగైనా వరించాలని అనుకున్నాడు. దీనికోసం అతగాడు రకరకాల మొబైల్ ఫోన్లతోపాటు సిమ్ కార్డులు మారుస్తూ.. ఆ వివాహిత సెల్ ఫోన్ కు అసభ్య పదుజాలంతో కూడిన ఎస్ఎమ్ఎస్ లు పంపింస్తూ వేధించడం మొదలు పెట్టాడు. కేవలం ఆమెకు కాదు.. ఆమె కుటుంబ సభ్యులకు సైతం పరుష పదుజాలంతో సెల్ ఫోన్ లో సందేశాలు పంపాడు. దీంతో విసిగిపోయిన సదరు వివాహిత.. షీ-టీమ్ కి ఫిర్యాదు చేసింది. వాళ్లు సాంకేతికంగా దర్యాప్తు చేసిన అనంతరం బాధితుడు పట్టుబడి కటకటాల్లోకి చేరాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ పరిధిలోని లాల్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాజిద్ హుస్సేన్ ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసించే ఓ వివాహితపై కన్నేసిన ఈ కీచకుడు.. ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీనికోసం వివాహితతోపాటు ఆమె భర్త, అత్తమామలకు అసభ్య వ్యాఖ్యలు, పరుష పదజాలంతో కూడిన సంక్షిప్త సందేశాలు సెల్‌ఫోన్లకు పంపాడు. ఇందుకోసం దాదాపు 30 సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్లు, అదే సంఖ్యలో బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వాడాడు. అతగాడి కీచక పనులకు అన్యోన్యంగా సాగుతున్న ఆ వివాహిత కుటుంబ జీవితం ఇబ్బందుల పాలైంది. దీంతో విసిగిపోయిన బాధితురాలు.. షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం సాజిద్ హుస్సేన్ ను బాధ్యుడిగా గుర్తించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించాయి. సాజిద్ వినియోగించిన ఫోన్లన్నీ వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైనవిగా గుర్తించిన పోలీసులు అవి అతడి దగ్గరకు ఎలా వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే తరహా నేరానికి పాల్పడిన మరో నిందితుడిని కూడా షీ-టీమ్స్ అరెస్టు చేయడంతోపాటు ఓ మైనర్‌నూ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసినట్లు ఆమె వివరించారు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రాంతానికి చెందిన కె.శ్రీశైలం విద్యార్థి. ఓ యువతిపై వేధింపులు ప్రారంభించిన ఇతగాడు ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులకూ అసభ్యపదజాలంతో కూడిన ఎస్సెమ్మెస్‌లు పంపాడు. యువతిని బెదిరిస్తూ కొన్ని ఈ-మెయిల్స్ చేశాడు. అతగాడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు.. షీ-టీమ్స్ ని సంప్రపదించింది. ఈ కేసునూ పర్యవేక్షించిన షీ-టీమ్స్ బుధవారం శ్రీశైలాన్ని అరెస్టు చేసి పెట్టీ కేసు నమోదు చేశాయి. నగరానికి చెందిన ఓ మైనర్ పరిచయస్థురాలైన బాలిక ఫొటోలు ఫేజ్‌బుక్‌లో పెట్టడంతోపాటు ఆమె తండ్రికీ ఆన్‌లైన్‌లో పంపిస్తూ వేధించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మైనర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, భవిష్యత్తులో మళ్లీ ఇటువంటివి చేయొద్దని హెచ్చరించి విడిచిపెట్టారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more