తన భర్త గుట్టును రహస్య కెమెరాలతో రట్టు చేసి.. అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పెట్టినందుకు గాను సదరు మహిళకు జైలు శిక్షను అనుభవించనుంది. పనిమనుషులు పిర్యాదుతో తేరుకుందో లేక.. తనకే అనుమానం కలిగిందో కానీ తాను లేనప్పుడు తన భర్త పని మనిషిలపై లైంగికంగా వేధిస్తున్నాడని తెలుసుకున్న ఓ సౌదీ మహిళ రహస్య కెమెరాతో తన భర్త తతంగాన్ని మొత్తం రికార్డుచేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాపై ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న సౌదీ ప్రభుత్వం ఈ వీడియో అంశం తెలిసి మరింత చిర్రెత్తుకొచ్చింది. వెంటనే దాన్ని తొలగించాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించింది.
ఇంతవరకు సరే అనుకున్నా.. అంతటితో అగలేదు.. తన భర్త పరువు బజారుపాలు చేసినందుకు ఏడాది పాటు జైలు శిక్ష లేదా దాదాపు 87 లక్షల రూపాయల జరిమానాను భార్యకు విధించనుందని ఓ ప్రముఖ సౌదీ న్యాయవాది ఇప్పటికే ఆ సౌదీ మహిళను హెచ్చరించారు. తన భర్త పనిమనుషులపై లైంగికంగా వేధిస్తూ.. వారితో సరససల్లాపాలు సాగిస్తున్నాడన్న అనుమానంతోనే తాను ఇలాంటి చర్యలకు పాల్పడ్డానని భార్య చెబుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అయితే అమెకు తన భర్త ప్రవర్తనపై ఎప్పటి నుంచో అనుమానం ఉంది. తాను లేనప్పుడు పని మనిషులతో సరస సల్లాపాలు సాగిస్తాడని అనుకుంది.
ఈ క్రమంలో ఓ రోజు కిచెన్‌కు సమీపంలో రహస్యంగా ఓ వీడియో కెమెరాను ఏర్పాటు చేసింది. కిచెన్ లోపల ఓ పనిమనిషి సంచరిస్తుండగా, కిచెన్ డోర్ పక్కన మరో పనిమనిషిని భర్త దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఆ వీడియోలో రికార్డు అయింది. ‘ఈ నేరానికి కనీస శిక్ష విధించాలి’ అన్న శీర్షికతో ఆ వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది భార్య. 12 గంటల్లోపే 25 వేల మంది దీన్ని షేరు చేసుకున్నారు. మొబైల్ లేదా ఇతర కెమెరాల ద్వారా ఎవరి వ్యక్తిగత అంశాలనైనా రికార్డుచేసి పదిమందిలో వారి పరువు తీయడం స్థానిక సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం పెద్ద నేరమని న్యాయవాది మజీద్ ఖరూబ్ స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more