ఆధాయం అధికంగా వస్తుందనే ఆశతో సౌదీ అరేబియాకు వలస వెళ్లిన ఓ భారతీయురాలికి దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ తప్పూ చేయని ఆమెను యజమాని అయిన ఉద్యోగి నిత్యం చిత్రహింసలకు గురి చేసేది. చివరికి ఆ ఉద్యోగిని కిరాతకం ఎంత హద్దు దాటిందంటే.. ఏకంగా ఆ పనిమనిషి చేతినే నరికేసింది. నిత్యం ఆ సౌదీ మహిళ పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ ఇంట్లో నుంచి ఆమె పారిపోవడానికి ప్రయత్నించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన కస్తూరి మణిరత్నం (58) అనే పొట్టకూటి కోసం మూడు నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లింది. అక్కడ ఓ ఉద్యోగిని ఇంట్లో పనిమనిషిగా చేరింది. అక్కడి నుంచి తన జీవితం సాఫీగా సాగుతుందని, తన కుటుంబసభ్యులకు డబ్బులు ఎక్కువ పంపించవచ్చునని ఆమె అనుకుంది. కానీ.. ఆమె ఆశించినట్లుగా ఏమీ జరగలేదు. పనిమనిషిగా చేరిన మొదటి రోజు నుంచే ఆ ఉద్యోగిని ఈమెని నిత్యం చిత్రహింసలకు గురిచేసింది. సమయానికి భోజనం పెట్టకపోగా.. చేతికి దొరికిన వస్తువుతో కొట్టేది. నిద్రాహారాలు లేక రాత్రింబవళ్లు ఒట్టిచాకిరి చేస్తూ ఆ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంది. అయితే.. రోజురోజుకూ ఆమె చిత్రహింసలు మరీ ఎక్కువవుతుండడంతో ఓసారి కస్తూరి ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అది గమనించిన ఆ ఉద్యోగి.. గత సెప్టెంబర్ 29న ఆమె చేతిని నరికేసిందని కస్తూరి కుటుంబసభ్యులు చెప్పారు. ఆమెను సౌదీ అరేబియాకు పంపిన ఏజెంట్ ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆమె రియాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.
కస్తూరిని స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు వారు డీఎంకే ఎంపీ కనిమొళి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాశారు. కస్తూరికి జరిగిన దారుణంపై సుష్మా స్వరాజ్ స్పందించారు. ఇది అనాగరిక చర్యని, తీవ్రంగా బాధించిందని సష్మా ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడామని, బాధితురాలితో భారత ఎంబసీ సంప్రదించిందని తెలిపారు. మరోవైపు.. ఈ దారుణానికి పాల్పడిన సదరు ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more