Chandrababu Naidus temple in Guntur

Chandrababu naidus temple in guntur

Chandrababu Naidu, Chandrababu Naidu temple, Guntur, Thullur mandal, Harishchandrapuram, babu, Chandrababu Temple by fans

Chandrababu Naidus temple in Guntur. Chandrababu Naidu's supporters in Guntur district are competing to demonstrate their gratitude to the chief minister for deciding to locate Andhra Pradesh's new capital Amravati there.

ITEMVIDEOS: చంద్రబాబు విగ్రహం రెడీ

Posted: 10/09/2015 01:45 PM IST
Chandrababu naidus temple in guntur

అవును.. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు గుడి కడుతున్నారు. అందుకు నారా చంద్రబాబు నాయుడుగారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. గుడి కట్టడానికి ఇప్పటికే రాజధాని గ్రామం తూళ్లూరులో చంద్రబాబు గారికి గుడి కట్టేందుకు సరంజామా సిద్దంగా ఉంది. బాబు గారి వల్లే తమ జీవితాల్లో మార్పులు వచ్చాయని, ఏపి రాజధానిని తమ గ్రామాలున్న ప్రాంతాల్లో ఏర్పాటు చెయ్యడం వల్ల ఒక్కసారిగా భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి. నిన్నటి దాకా బతుకు జీవుడా అంటూ జీవితాన్ని గడిపిన రైతులు, ఇప్పుడు మాత్రం దర్జాగా హుందాగా, ఆనందంగా ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమే అని అందుకే తమ పాలిట అడగకుండా వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడుకు గుడి కట్టించి.. దేవుడిగా ఆరాధిస్తామని అక్కడి గ్రామస్తులు అంటున్నారు.

మొత్తానికి మొన్నటికి మొన్న నరేంద్ర మోదీకి గుడి కట్టిన వార్త విన్నాం. ఇక తెలుగు నాట కూడా ఆ గుడి కట్టే సంస్రృతి ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు వల్ల తమ జీవితాలు మారడమే కాకుండా అన్నీ మంచే జరుగుతున్నాయని రాజధాని గ్రామాల ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే బాబుకు గుడి కట్టి.. చంద్రబాబు నాయుడును మనసారా కొలుచుకుంటారట. కాగా గుడి కట్టడానికి ఇంకా అనుమతులు లభించలేదు. కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు విగ్రహం తయారీ ముగిసింది. ఈ నెలలో అమరావతి పూజకు అంతా సిద్దమవుతున్న వరుణంలో చంద్రబాబు నాయుడుకు గుడి కట్టడం కూడా వార్తల్లో నిలిచింది. బాబు గారి విగ్రహం చాలా వరకు ప్రతిష్టకు సిద్దమైంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ కళాకారుడు చంద్రబాబు నాయుడు విగ్రహాన్ని సిద్దం చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా అభిమానులు గుడి కట్టించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles