A Dead Woman Kanaka Durga Got up Alive Suddenly While Taking Her For Post Mortem | Hyderabad Crime News

Dead woman kanaka durga gotup alive before post mortem

Dead women got up, suicide attack woman alive, dead women sudden gotup alive, kanaka durga sudden got up from death, suicide attacks, women suicide cases

Dead Woman Kanaka Durga Gotup Alive Before Post Mortem : A Dead Woman Kanaka Durga Got up Alive Suddenly While Taking Her For Post Mortem.

చనిపోయిన యువతి ఒక్కసారిగా లేచి కూర్చుంది!

Posted: 10/10/2015 12:09 PM IST
Dead woman kanaka durga gotup alive before post mortem

ఆ యువతికి భూమి మీద ఇంకా నూకలు మిగిలే వున్నట్లు వున్నాయి.. అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకున్నప్పటికీ బ్రతికిపోయింది. అప్పటివరకు ఆ యువతి చనిపోయిందని అంతా భావించారు.. పోస్టుమార్టం నిమిత్తం ఆమెని దుప్పటిలో చుట్టి, ఆటో ట్రాలీలో పడుకోబెట్టారు.. అంతలోనే ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. అంతే! అక్కడున్న స్థానికులు, పోలీసులు అవాక్కయ్యారు. ఆమె లేవడాన్ని చూసిన కొందరు భయంతో పరుగులు తీస్తే.. మరికొందరికి నోటివెంట మాట రాలేదు. కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం తలపట్టుకని ‘ఇదెలా సాధ్యం’ అంటూ చూస్తూ మిన్నకుండిపోయారు. అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా ఇప్పలపాడు గ్రామానికి చెందిన సత్తిబాబుకు పడాల కనకదుర్గ (22) అనే కుమార్తె వుంది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఏడాది గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో కనక దుర్గను భర్త వదిలేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు భారం కాకూడదని మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చింది. గండి మైసమ్మ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని ఉంటూ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది. అయితే.. భర్త దూరం కావడం, ఒంటరిగా జీవితం కొనసాగించడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసేవి. కొన్నాళ్లు ఆ వేదనను దిగమింగుకుని జీవితాన్ని కొనసాగించింది. కానీ.. ఆ బాధ మరింత ఎక్కువవడంతో ఆత్మహత్యే శరణమని భావించింది. గురువారం ఉదయం 10 గంటలకు తన గదిలోకి వెళ్లి, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం అప్పటివరకు ఎవరికీ తెలియరాలేదు.

అయితే.. రాత్రైనప్పటికీ కనకదుర్గ తన గది నుంచి బయటకు రాకపోవడం, గది నుంచి పెద్దగా టీవీ శబ్ధం వస్తుండటంతో స్థానికులు తలుపులు తట్టారు. ఉలుకు.. పలుకు లేదు. దాంతో వారికి అనుమానం రాగా.. అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు కూడా స్పందించలేదు. దీంతో శుక్రవారం ఉదయం తలుపులు బద్దలకొట్టి చూడగా కనకదుర్గ నిర్జీవంగా పడి ఉంది. దీంతో ఆమె చనిపోయిందని భావించి, గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఆటోట్రాలీలో కనకదుర్గను పడుకోబెట్టారు. ఇంతలో ఆహె ఒక్కసారిగా లేచి కూర్చింది. అంతే.. స్థానికులతోపాటు పోలీసులు అవాక్కయ్యారు. ఆ షాక్ నుంచి పోలీసులు కోలుకున్న అనంతరం వెంటనే ఆమెను సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స అనంతరం ఆమెను పోలీసులు విచారికంగా.. జీవితంపై విరక్తితోనే తాను నిద్రమాత్రలు మింగానని కనకదుర్గ చెప్పింది. అయితే.. పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanakadurga got up alive  dead woman got up alive  hyderabad crime news  

Other Articles