supreme court on Suprabhatam

Supreme court on suprabhatam

Venkatesa Suprabhatham, Padmanabhaswamy temple, Lord Vishnu, Supreme Court, Kerala Temple, Kerala Temple Treasure

For almost an hour, the country's top court today discussed and debated whether the Sanskrit shlokas Venkatesa Suprabhatham, a morning chant, can be recited to wake up Lord Vishnu at the Padmanabhaswamy temple in Thiruvananthapuram.

సుప్రభాతం అవసరమా.? లేదా..? సుప్రీం‘తీర్పు’

Posted: 10/10/2015 03:18 PM IST
Supreme court on suprabhatam

అవును.... దేవుడిని నిద్రలేపేందుకు ఉదయాన్నే వేసే సుప్రబాతం మీద సుప్రీంకోర్ట్ లో తీవ్ర చర్చ సాగింది. అసలు సుప్రభాతం వెయ్యకూడదు అని ఓ వాదన కుదరదు.. అలా ఎలా ఖచ్చితంగా సుప్రభాతం పాడాల్సిందే అంటూ సుప్రీంకోర్ట్ లో ఈ ఉదయం రసవత్తర చర్చసాగింది. తెల్లవారుజామున దేవుడిని పూజారులు సుప్రభాతం పాడి లేపుతుంటారు. సుప్రభాత సేవ తర్వాత మిగిలిన అన్ని రకాల పూజలు చేస్తారు. అయితే తాజాగా సుప్రీంకోర్ట్ లో జరిగిన వాదప్రతివాదాలు కొత్త చర్చకు దారి తీశాయి. త్రివేండ్రం అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో సుప్రభాత సేవలో బాగంగా సుప్రభాతం పాటలు పాడాలా వద్ద అన్న దాని మీద కెకె వేణుగోపాల్, గోపాల సుబ్రహ్మణ్యం మధ్య జరిగిన తాజా వాదప్రతివాదాలు చర్చకు దారి తీవాయి.

త్రివేండ్రం పద్మనాభ స్వామి దేవాలయంలో ఎంతో విలువైన నిధులు దొరికాయి. అతి ఖరీదైన మన్యాలు ఆ గుడిలో తాజాగా గుర్తించారు. అయితే అప్పటి దాకా మామూలుగా ఉన్న ఆ పద్మనాభస్వామి దేవాలయానికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. వార్తల్లో చూసి చాలా మంది అక్కడికి వచ్చారు. అయితే అక్కడ పద్మనాభస్వామి యోగ నిద్రలో ఉంటారు. అయితే దేవాలయంలో సుప్రభాతం పాటలు, శ్లోకాలు పాడాలా వద్దా అన్న దాని మీద సుప్రీంకోర్ట్ లో చర్చసాగింది. అయితే పద్మనాభస్వామి శయనిస్తున్నారు కాబట్టి ఆయన్ని నిద్రలేపాల్సిన అవసరం లేదని అందుకే సుప్రభావం పాడాల్సిన అవసరం లేదు అన్నది వాదన. కాగా దేవుళ్లు ఏ రూపంలో ఉన్నా కానీ సుప్రభాతం ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ మరో వాదన. అయితూ సుప్రీంకోర్ట్ దీని మీద తుది తీర్పును వెల్లడించింది. ఆచారాలను మార్చడం కుదరదని.. అయితే అనంతపద్మనాభస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుడు సుప్రబాతం నిర్వహించాలా వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తారని తీర్పునిచ్చింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles