Chandrababu to invite KCR for Amaravati Foundation ceremony

Naidu to personally invite kcr for amravati s ceremony

andhrapradesh chief minister, chandrababu naidu, telangana cm, kcr, amaravati inaugration, ap capital amaravathi inaugration, Telangana chief minister kcr, kcr will be personally invited

AP Chief Minister N Chandrababu Naidu in the Cabinet Meeting that was held on Saturday informed that he would personally invite KCR for the foundation ap capital amaravathi Foundation ceremony

ఆమరావతికి కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తా: చంద్రబాబు

Posted: 10/10/2015 07:22 PM IST
Naidu to personally invite kcr for amravati s ceremony

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందనుంది. గత 16 నెలల క్రితం వరకు సమైక్యంగా వున్న తెలుగు రాష్ట్రం పునర్విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడడంతో.. పొరుగు రాష్ట్రం.. అందులోనూ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేకంగా నవ్యాంధ్ర రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి అహ్వానించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇంధులో భాగంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తానే స్వయంగా పిలుస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నాటి కేబినెట్ మీటింగ్ లో తెలిపారు.

తానే స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్లి.. నవ్యాంద్ర రాజధాని నిర్మాణానికి కేసీఆర్ సహా ఆయన కుటుంబసభ్యులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దీనికితోడు, ప్రధాన వేదికపై 15 మంది అతిథులకు మించకుండా చూడాలని ప్రధాని కార్యాలయం తెలిపిందని.. అందువల్ల వేదికపై ఎక్కువ మంది లేకుండా చూడాలని మంత్రివర్గ సహచరులకు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వాన పత్రాలు అందించాలని బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీచే రాజధానికి శంకుస్థాపన జరగనుంది. అయితే అమరావతి ఆహ్వానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles