BJP Leader Navjot Singh Sidhu admitted to Hospital after Vein Clot

Mohammad azharuddin meets navjot singh sidhu in hospital

navjot singh sidhu, navjot singh, mohammad azharuddin, azharuddin, india cricket team, india cricket, cricket india, cricket news, cricket

Former India captain Mohammad Azharuddin paid the former India opening batsman a visit at the hospital.

సిద్దూకు నాటి కెప్టెన్ పరామర్శ.. నా సోదరుడంటూ వ్యాఖ్య..

Posted: 10/10/2015 07:26 PM IST
Mohammad azharuddin meets navjot singh sidhu in hospital

ఒకనాడు వారిద్దరి మద్య వైరం సాగింది. అది ఎంతలా అంటే.. ఇద్దరూ బద్ద శత్రువుల మాదిరిగానే వ్యవహరించారు. అయితే కాల గమనంలో కోపాతాపాలకు సన్నగిల్లుతాయని, తన అనుకున్న వారిని అప్యాయంగా వెతుక్కుంటూ వస్తారని పెద్దలు చెప్పిన నానుడి అక్షరాల నిజమని నిరూపించారు ఆ ఇద్దరు మిత్రులు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో డీప్ వీన్ త్రోంబోసిస్ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సర్ ప్రైజ్ విజిట్ తో ఆశ్చర్యపరిచాడు. ఆసుపత్రికి వెళ్లిన అజ్జుభాయ్ 'నా సోదరుడు హాస్పిటల్ లో ఉన్నాడు, చూడాలి' అంటూ అక్కడున్న హాస్పిటల్ స్టాఫ్ కు ఆశ్చర్యాన్ని కలిగించాడు.

దాదాపు 19 ఏళ్ల తర్వాత సిద్ధూ, అజార్ కలుసుకున్నారు. 1996 లో ఇంగ్లాడ్ టూర్ కు వెళ్లిన సందర్భంగా ఓ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. అప్పటి కెప్టెన్ అజారుద్దీన్ శైలిని నిరసిస్తూ సిద్ధూ సిరీస్ ను వాకౌట్ చేశాడు. అలాంటి అజార్ తనను వెతుక్కుంటూ రావడంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సిద్ధూ సంతోషాన్ని పట్టలేకపోయాడు. అజార్ తో సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా... పాత బంగారం, పాత వైన్, పాత స్నేహితులు ఇప్పటికీ అపురూపమే అంటూ కామెంట్ చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Azharuddin  Navjot Singh Sidhu  hospital  

Other Articles