Batukamma time is kavitha time

Batukamma time is kavitha time

Kavitha, MP Kavitha, KCRs daughter, Kavitha on bathukamma, Bathukamma, Bathukamma festival, Telangana state festival

Nizamabad MpKavitha as the barnd ammbesder of Telangana state festival Bathukamma. Bathumma is the only brand for the Telangana Jagruthi, which is organised by Kavitha.

బతుకమ్మ టైం.. కవిత టైం.. మరి మిగతాటైంలో కవిత ఏం చేస్తుంది..?

Posted: 10/12/2015 11:29 AM IST
Batukamma time is kavitha time

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ తో సహా అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది. అయితే బతుకమ్మ పండుగ అనగానే గుర్తుకు వచ్చే పేరు.. నిజామాబాద్ ఎంపీ కవిత. కేసీఆర్ కూతురిగా, నిజామాబాద్ ఎంపీగా తనకు గుర్తింపు ఉన్నా కానీ తెలంగాణలో నిర్వహించే బతుకమ్మకు మాత్రం కవిత బ్రాండ్ అంబాసిడర్ లా మారారు. గతంలో ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ పేరుతో అటు పార్టీని, ఇటు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బతుకమ్మ పండుగ బాగానే కలిసి వచ్చింది. అయితే మరి కవిత గతంలో పార్లమెంట్ లో కాశ్మీర్ పండిట్ ల గురించి మాట్లాడి అందరి దృష్టిలో పడింది. జాతీయ మీడియా కూడా కవిత గురించి కథనాలు ప్రచురించాయి. మరి బతుకమ్మ టైంలో మాత్రం తెలంగాణలో కవిత పేరు.. ఆమె పెట్టిన తెలంగాణ జాగృతి పేరు మారుమోగుతోంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది. బుతకమ్మ పండగ టైంలోనే కవిత పేరు పీక్స్ లో ఉంటుందా.?? మరి మిగతా టైంలో ఎందుకు ఉండదు..? మొత్తం స్టోరీ చదవండి.

కవిత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిగా, నిజామాబాద్ ఎంపీగా కవితకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. అయితే అంతకన్నా బతుకమ్మ పండగ టైంలో కవిత పేరు చాలా పాపులర్. ఎంతలా అంటే విపక్షాల నాయకులు కవిత మీద, కేసీఆర్ మీద కలిపి విమర్శలు చేసేంతలా. కవితమ్మను బొమ్మను చేస్తివి... బతుకమ్మను చేస్తివి.. తెలంగాణలో ఊరేగిస్తివి.. కేసీఆర్ సారూ.. నీకు వందనాలు అంటూ కళాకారులు కూడా కవిత మీద సెటైరికల్ సాంగ్స్ పాడుతున్నారు. మరి తెలంగాణ జాగృతి పేరుతో పెట్టిన సంస్థ ఏం చేస్తోంది. ? తెలంగాణ పండుగ బతుకమ్మను నిర్వహించడం తప్ప కవిత చేసిందేమిటి..? ఉద్యమం సమయంలో ఊరుఊరా తెలంగాణ పండుగ బతుకమ్మను ప్రచారం చేసింది. కవిత. కేసీఆర్ కూతురిగా ఉన్న పాపులారిటీని బతుకమ్మకు వాడుతూ.. చివరకు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు.

నేటి నుండి ప్రారంభంకానున్న బుతకమ్మ వేడుకలకు కూడా కవితే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి బతుకమ్మ కాకుండా కవిత చేసిందేమిటి..? నిజానికి చెప్పాలంటే ఏమీ లేదు. ఎందుకు అంటారా..? తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మ చేసిందేమీ లేదు. తెలంగాణ జాగృతి పేరుకు మాత్రమే నిలిచింది కానీ ఎలాంటి జాగృతి లేదు. అచేతనంగా మారింది. ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ఈవెంట్ ఆర్గనైజర్ లాగా మారింది. అవును ఈవెంట్ ఆర్గనైజర్ లానే మారింది. ఎందుకంటే.. కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి చేసే ఒకే ఒక్క పని బతుకమ్మ పండుగను వీలైనంత గ్రాండ్ గా చెయ్యడం. మరి ఒక్క బతుక్మ్మ పండుగ మాత్రమే చేస్తే దానికి ఈవెంట్ ఈర్గనైజేషన్ అని పేరు పెట్టొచ్చు కదా. తెలంగాణ జాగృతి పరిస్థితి ఇలా ఉంటే మరి కవితి పరిస్థితి ఎంటి అనుకుంటున్నారా.? చూడండి మీరే..

రాజకీయ కుటుంబ నేపథ్యంలో కవితకు పాపులారిటీ ఉంది. అందుకే నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో కవిత గెలుపు సునయాసం అయితే ఎన్నికల తర్వాత పార్లమెంట్ లో అప్పుడప్పుడు కొన్ని కీలక అంశాల మీద కవిత మాట్లాడటం చూశాం. అయితే కవిత వల్ల ఇప్పటి దాకా వచ్చిన ప్రయోజనం అయితే ఏమీ లేదు. బుతకమ్మ పండుగ కోసం అంటూ విదేశాలు తిరగడం తప్ప పెద్ద ప్రయోజనం లేదు. బుతకమ్మ పండగ ప్రారంభం కాగానే కవిత షెడ్యూల్ బిజీ అవుతుంది. ఎందుకంటే మిగిలిన టైం ఎలా ఉన్నా ఈ పండగ టైంలో మాత్రం చాలా బిజీ మరి. బతుకమ్మ బ్రాండ్ తో ప్రస్తుతానికి కవిత కెరీర్ బాగా సాగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కవితకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. పైగా బతుకమ్మ పండగ బ్రాండ్ ఎప్పటికీ నిలుస్తుంది కాబట్టి కవితకు బాగా కలిసి వస్తుంది. దేనికైనా పెట్టి పుట్టాలి అంటే ఇదేనేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles