గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేసేందుకు ఈజీ మని వేటలో పడి వక్రమార్గం తోక్కిన నవయువకులు.. చివరకు కటకటాల పాలయ్యారు. ఈజీ మనీ కోసం బైక్ దోంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లను ఎంచుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కి.. ఊచలు లెక్కబెడుతున్నారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన 50 తులాల బంగారం, 11 బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ, గర్ల్ ఫ్రెండ్ లు వారిని పోకరిల నుంచి చోరులుగా మర్చాయని ఇప్పడు గతాన్ని తలచుకుని ఎంత బాధపడినా ఏం లాభం. వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన నేదునూరి శ్రావణ్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలివాడకు చెందిన తొంగరి రాము, పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బొకరి సునీల్‌రాజ్ మిత్రులు. శ్రావణ్, రాము పెద్దపల్లిలో, సునీల్‌రాజ్ కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో నివాసముం టున్నారు. వీరికి గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నచిన్న పనులతో వచ్చే డబ్బులతో గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేయడం ఇబ్బంది అవడంతో చోరీలు మొదలెట్టారు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా వారి మెడల్లోని చైన్‌లు లాక్కుని పారిపోయేవారు.
వీరు పెద్దపల్లిలో ఉంటూ బస్సుల్లో కరీంనగర్ వచ్చి రాత్రివేళ నంబర్‌లేని బైక్‌లను గుర్తించి చోరీ చేసేవారు. మరునాడు వేకువజామున ముగ్గురూ కలిసి రెక్కీ నిర్వహించి ప్లాన్ అమలు చేసేవారు. ఒక్కోసారి ఒక్కరే... మరో చోట ఇద్దరు.. ఇంకోచోట ముగ్గురు ఇలా మూడు ముఠాలు చోరీ చేస్తున్నట్లుగా సృష్టించేవారు. అనంతరం వారు బైక్‌ను ఎక్కడన్నా వదిలేసి వెళ్లిపోయేవారు. కొన్ని నెలలుగా జిల్లాకేంద్రంతోపాటు సుల్తానాబాద్, మంచిర్యాల ప్రాంతా ల్లో చోరీలకు పాల్పడ్డారు. వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చుచేసేవారు. అవసరమైతే బైక్‌లు అమ్మేవారు.
ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 30 దొంగతనాలను ప్రణాళికా బద్దంగా నేరవేర్చి సక్సెస్ అయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దొంగల కోసం 15 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 4న నగరంలోని విద్యానగర్‌లో చైన్‌స్నాచింగ్ చేసి పారిపోతున్న వీరిని టూటౌన్ పోలీసులు వెంటపడి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అడ్డు అదుపులేకుండా ఇన్నాళ్లు చేసిన చోరీలకు మూల్యం చెల్లించుకున్నారు. వీరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా చోరీల జాబితా బయటపడింది. కరీంనగర్‌లో టూటౌన్ పరిధిలో 11 నేరాలు, 9 చైన్‌స్నాచింగ్‌లు, 6 బైక్‌లు, త్రీటౌన్ పరిధిలో 6 చైన్ స్నాచింగ్ లు, వన్‌టౌన్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, సుల్తానాబాద్ పీఎస్ పరిధిలో 2 చైన్‌స్నాచింగ్‌లు, 1 బైక్, మంచిర్యాల పీఎస్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, 1 బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారం, రూ.5 లక్షల విలువైన 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more