మానవత్వం పరిమళించే మంచి మనస్సు స్వాగతం అంటూ తెలుగు సినీ కవులు రాసిన గీతాన్ని.. ప్రస్తుతం ఫేస్ బుక్ లోని ఓ ఫోటోను చూసిన వారందరూ అలపిస్తున్నారు. అంతేకాదు మానవత్వం కనబర్చిన ఆ యువకుడిని భేష్ అంటూ శ్లాఘిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు చేసిందేమిటీ..? ఆయనలోని మానవత్తం పరిమళించేందుకు ఎ సంఘటన దోహదపడింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన ఆ మంచి పనేంటి.? వివరాల్లోకి వెళ్తే.. కెనడాలోని ఒట్టారియో నగరంలో రద్దీగా వెళుతున్న ఓ బస్సులో గాడ్ఫ్రే క్యుహొట్టో అనే 22 ఏళ్ల విద్యార్థి ఓ వయో వృద్ధుడికి తన పక్కనే సీటినిచ్చాడు.
అంతేకాకుండా చేతులతో ఆసరా ఇచ్చి కునుకుతో సేదతీరేందుకు తన భుజాన్ని కూడా ఆసరగా అందించిన ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ వెబ్సైట్లో విశేషంగా ఆకర్షిస్తోంది. ఇటీవల ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ ఫొటోను ఇప్పటికే 50 వేల మంది యూజర్లు లైక్ చేశారు. పదివేల మంది షేర్ చేసుకున్నారు. వేలాది కామెంట్లు వచ్చాయి. విద్యార్థి ఆసరాతో హాయిగా కునుకుతీస్తున్న వయో వృద్ధుడిని రాబర్ట్‌గా గుర్తించారు. ఆయనకు బ్రహ్మ చెవుడే కాకుండా మానసిక పక్షవాతంతో బాధ పడుతున్నారు. విద్యార్థి కూర్చోవడానికి సీటివ్వడంతో కృతజ్ఞతా పూర్వకంగా చేతులు పట్టుకున్నారు. అలాగే ఆ చేతులను, విద్యార్థి భుజాలను ఆసరాగా చేసుకొని హాయిగా నిదురపోయారు ఆ వృద్ధుడు.
ఆ విద్యార్థి ఏ మాత్రం విసుక్కోకుండా అలాగే కదలకుండా కూర్చొని వృద్ధుడికి స్వాంతన చేకూర్చారు. ముందుగా కరచాలనం కోసం చేతిని అందించారని అనుకున్నానని, తర్వాత ఆయన వృద్ధాప్యంతోనే కాకుండా అనారోగ్యంతో బాధ పడుతున్నానని గ్రహించానని హమిల్టన్‌లోని మ్యాక్‌మాస్టర్ యూనివర్శిటీలో చదువుతున్న గాడ్ఫ్రే తెలిపారు. తోటి విద్యార్థుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో బంధించి ఫేస్బుక్లో పోస్టు చేశారు.
‘బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్’ అంటూ ఎంతోమంది కామెంట్ చేశారు. ‘కొన్ని సమయాల్లో నీవు స్వార్ధం వదులుకోవాలి. ఎవరికో ఒకరికి నీ భుజాలు ఆసరా అవుతాయి’ అని కొందరు, రాజకీయాలను కరీర్గా ఎంచుకోవాల్సిందిగా మరికొందరు సూచించారు. తామేమి చేయాలో చేసి చూపించావనే అర్థంలో ఇంకొందరు కామెంట్ చేశారు. ఆ వయో వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా ఆ విద్యార్థికి అభినందనలు తెలిపారు. ‘ఇందులో నాగొప్పేమీ లేదు. నా తల్లి నన్నలా పెంచింది. ఓ రాణి చేతిలో నేను పెరిగాను’ అని గాడ్ఫ్రే స్థానిక రేడియో స్టేషన్‌తో వ్యాఖ్యానించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more