మంచి ఉద్దేశ్యంతో చేసే అకతాయి పనులు చివరకు మంచిగానే ముగుస్తాయి. పలువురికి మంచి జరగడం కోసం కొంత కంగారు పెట్టించినా శుభంగానే ముగుస్తుండటంతో.. అంతా సరదాగానే తీసుకుంటారు. కానీ లేనిది వున్నట్లుగా, వున్నది లేనట్టుగా కనికట్టు విద్యలా సోషల్ మీడియాను వాడుకుని ఓ ఇద్దరు కలసి చేసిన చేసిన అకతాయి పనులు వారికి అరదండాలు పడేలా చేశాయి. ఇంతకీ వీరు చేసిన అకతాయి పనేంటో తెలుసా..? యాకుత్‌పురా ఎమ్మెల్యే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వదంతులు సృష్టించారు.
వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్, యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ రాషెద్ అలియాస్ మహ్మద్ జుబేర్ అహ్మద్‌ఖాన్ స్నేహితులు. మహ్మద్ పహిల్వాన్ మృతిచెందాడని ఇటీవల వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో వచ్చిన సందేశాలతో మీడియా ప్రతినిధులు, పోలీసులు, నెట్ యూజర్స్ బిజీగా మారారని గుర్తించిన రాషెద్.. తాను కూడా ఇలా సంచలనం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 8న ‘యాకుత్‌పురా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ మృతి చెందారు. రేపు మధ్యాహ్నం మక్కా మసీదులో జనాజ్ నమాజ్ ఉంది. దీనికి అందరూ హాజరు కావాలి’ అని వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు.
ఈ మెసేజ్‌ను అందరికీ షేర్ చేయాలంటూ తన స్నేహితుడు ఇమ్రాన్ వాట్సాప్ గ్రూప్ ‘దునియా ఔర్ ఆకీరత్‌కీ బాత్’కు పంపించాడు. వాట్సాప్ అడ్మిన్‌గా ఉన్న ఇమ్రాన్ ఎలాంటి నిర్థారణ చేసుకోకుండా దీనిని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త సామాజిక సైట్లలో చక్కర్లు కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు, మజ్లీస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి వాకబు చేయగా వార్త నిజం కాదని తేలింది. ఈ విషయమై ఎమ్మెల్యే అనుచరుడు అదేరోజు రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
నిందితులను పట్టించిన ‘థర్డ్ ఐ’...
నూతనంగా ప్రవేశపెట్టిన పోలీస్ వెబ్ అప్లికేషన్ ‘థర్డ్ ఐ’ సహకారంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోజుల వ్యవధిలోనే ఈ కేసును చేధించారు. ఫేస్ బుక్‌లో ఇమ్రాన్ పేర్లతో సందేశం వుండటంతో.. ఆ పేర్ల కోసం వెతకగా వంద పేర్లు కనిపించాయి. అందులో టెక్నికల్ పాయింట్ల ఆధారంగా వెతకగా మ్యాస్ట్రో ద్విచక్ర వాహనం (ఏపీ 10 బీడీ8502) ముందు కూర్చున్న యువకుడి ఫొటో ఉన్న అకౌంట్‌పై పోలీసులకు అనుమానం కలిగిం ది. వాహనం నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తే బన్సీలాల్‌పేటకు చెందిన షేక్ ముస్తఫా చిరునామా వచ్చింది. ఆ చిరునామాకు వెళ్లగా ఖాళీ చేసినట్లు తేలింది.
అయితే ఫేస్బుక్లో ఉన్న ఫొటో చూపించగా అది షేక్ ఇమ్రాన్‌దని.. అతని తండ్రి ఆజం పాషా జీహెచ్ఎంసీలో నాలుగో తరగతి ఉద్యోగి అని స్థానికులు చెప్పారు. బాలానగర్‌లో ఉంటున్న వారి నివాసానికి వెళ్లిన పోలీసులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం వెల్లడించాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా రాషెద్‌ను కూడా అరెస్ట్ చేశారు. సోషల్ నెట్వర్క్ సైట్లలో వచ్చే మెసేజ్‌లను నిర్థారించుకోకుండా మరొకరికి పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more