ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. మూడు దేశాలకు చెందిన ప్రధానమంత్రులతోపాటు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంకా ఎందరో నేతలను ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఇంకా ఎందరో రైతులతోపాటు సాధారణ ప్రజలు కూడా హాజరు కానున్న ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా కన్నులపండుగలా కనువిందు చేసేలా సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం విశేషం.
ఈ విధంగా నిర్వహించనున్న ఈ శంకుస్థాపన నిర్వహణను (యాంకరింగ్) డైలాగ్ కింగ్ సాయికుమార్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన ఏర్పాట్లపై సీఎం క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. అంతేకాదు.. ప్రారంభానికి ముందు సభలో ప్రఖ్యాత కళాకారుడు శివమణి వాద్య ప్రదర్శనతోపాటు కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో ‘మన అమరావతి’ (50 మంది డాన్సర్లు కూచిపూడి స్టైల్లో 12 నిముషాలపాటు ‘జయ జయహే అమరావతి’ పాటకు డాన్స్ చేయనున్నారు), ‘రైతుకు వందనం జానపద (7 నిముషాల ప్రోగ్రామ్)’, ‘కూచిపూడి’ నృత్యరూపకాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సాయికుమార్ తోపాటు ప్లేబ్యాక్ సింగర్ సునీతా కూడా యాంకరింగ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇదిలావుండగా.. 40 ఏళ్లుగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సాయికుమార్.. ఈ ప్రతిష్టాత్మక రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తుండడం.. ఆయన జీవితంలో అదో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ రాజధాని నిర్మాణంలో భాగంగా సాయికుమార్ వాయిస్ ఓ మైలురాయిగా నిలవనుంది. అటు ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వానికి సాయికుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more